Begin typing your search above and press return to search.

హేటర్స్ కి వర్మ మెసేజ్.. 'అరియానా మిక్స్ ఆర్జీవీ' అంటూ మరో బోల్డ్ వీడియో..!

By:  Tupaki Desk   |   29 Jun 2021 8:30 AM GMT
హేటర్స్ కి వర్మ మెసేజ్.. అరియానా మిక్స్ ఆర్జీవీ అంటూ మరో బోల్డ్ వీడియో..!
X
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. సినిమాలతోనే కాకుండా ట్వీట్స్ - ఇంటర్వ్యూలతో కూడా సంచలనం రేపుతాడు. విమర్శలను ఏ మాత్రం కేర్ చేయని వర్మ.. తనదైన శైలిలో ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఆర్జీవీతో ఒక్క ఇంటర్వ్యూ చేసి 'బిగ్ బాస్' హౌస్ కు వెళ్లేంత పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ అరియనా.. ఇటీవల వర్మతో కలిసి 'అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ఆర్జీవీ' అంటూ వచ్చింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ బోల్డ్ అంశాల గురించి బోల్డ్ గా ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవీ - అరియనా చర్చించారు. ఇది మీడియాలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో చర్చకు దారితీసిందో చూశాం. దీనిపై న్యూస్ ఛానల్స్ లో డిబేట్లు కూడా పెట్టేసారు. ఈ క్రమంలో వర్మ విమర్శలు చేసే వారిని చిల్ అవమంటూ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసారు. హేటర్స్ కి ఇదే నా మెసేజ్ అంటూ 'అరియనా మిక్స్ ఆర్జీవీ' అనే మరో వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

'అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ఆర్జీవీ' ఇంటర్వ్యూకి 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చినందుకు నేను అరియానా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎవరెవరైతే ఆ ఇంటర్వ్యూ చూసి సంతోషంగా లేరో వాళ్లందరికీ లవ్ యూ.. ఎందుకంటే మీ అందరికీ మాలాంటి మెచ్యూరిటీ రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. మీకు మెచ్యూరిటీ రాకపోయినా పర్వాలేదు. ఆ వీడియో చూసి ఈ సమాజం ఏంటి ఇలా అయిపోయింది అని నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళందరికి నేను ఒక ఉచిత సలహా ఇస్తున్నాను. అప్పుడప్పుడు కొంచెం చిల్ అవడం నేర్చుకోండి. లైఫ్ ని మరీ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి. ఈ సందర్భంగా 'అరియానా మిక్స్ ఆర్జీవీ' అనే పేరుతో అదే వీడియో చిన్న చిన్న గిమ్మిక్కులు చేసి ఇంకో వర్షన్ రిలీజ్ చేస్తున్నాం. చూడండి.. చూసి ఆనందించండి.. దీనిపై ప్రొగ్రాములు పెట్టండి.. తిట్టడం దూషించడం లాంటివి కూడా చేయండి. దానివల్ల మాకు ఇంకా వ్యూస్ పెరుగుతాయి. అందుకే వారందరికీ ఇప్పుడే థ్యాంక్స్ చెబుతున్నాను అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.