Begin typing your search above and press return to search.

బిబి4 : ఇక్కడ ఏడిస్తే సేవ్‌ అవ్వం

By:  Tupaki Desk   |   24 Nov 2020 3:21 PM GMT
బిబి4 : ఇక్కడ ఏడిస్తే సేవ్‌ అవ్వం
X
నిన్నటి ఎపిసోడ్‌ లో ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ జరిగింది. అందులో భాగంగా అవినాష్‌, అరియానా, అఖిల్‌ మరియు మోనాల్‌ లు ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యారు. మోనాల్‌ సేవ్‌ అయ్యేలా గ్రీన్‌ క్యాప్‌ దక్కించుకున్నా అనూహ్యంగా హారిక కెప్టెన్సీ పవర్‌ వల్ల ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యింది. ఇక ఎప్పుడు లేనిది ఈ వారం నామినేట్‌ అవ్వడంతో అరియానా చాలా ఎమోషనల్‌ అవుతుంది. నిన్నటి ఎపిసోడ్‌ లో రెడ్‌ కలర్‌ టోపీ పెట్టుకున్న తర్వాత ఆమె మొహంలో క్లీయర్‌ గా ఏడుపు కనిపించింది.

నేటి ఎపిసోడ్‌ లో కూడా అందుకు సంబంధించిన చర్చ జరుగుతుంది. అభిజిత్‌ చాలా ఈజీగా మోనాల్‌ తో స్వైప్‌ అయ్యి సేవ్‌ అవ్వడంను అఖిల్‌ విమర్శించాడు. సోహెల్‌ తో మాట్లాడిన సమయంలో ఆ మనిషి ఇలా ఎలా చేస్తాడు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. వెనుక మాట్లాడుతాడు అంటూ ఇంతకు ముందు అభిజిత్‌ ను విమర్శించిన అఖిల్‌ ఇప్పుడు అతడి గురించి సోహెల్‌ తో మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో అరియానా అదే పనిగా ఎమోషనల్‌ గా ఉండటంతో అవినాష్‌ ఏడిస్తే ఇక్కడ సేవ్‌ అవ్వం అంటూ పంచ్‌ డైలాగ్‌ కొట్టాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్‌ కూడా చాలా రసవత్తంగా సాగబోతుంది.