Begin typing your search above and press return to search.

అరియానా - అవినాష్.. ఓ టీవీ షో..?

By:  Tupaki Desk   |   26 Dec 2020 9:45 AM IST
అరియానా - అవినాష్.. ఓ టీవీ షో..?
X
‘బిగ్ బాస్-4’ సీజన్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కంటిస్టెంట్స్ ఎప్పటి లాగానే గేమ్ కొనసాగించినప్పటికీ.. ఆడ,మగ ఫ్రెండ్షిప్.. పులిహోర కలపడాలు.. హగ్గులు.. కిస్సులు అంటూ చాలా దూరం వెళ్లింది హౌస్ లో వ్యవహారం. అలాంటి జంటల్లో ఒక ఫెయిర్ ‘అరియానా-అవినాష్’.

అయితే.. మొదట అరియానాతో పులిహోర కలిపేందుకు అవినాస్ బాగానే ప్రయత్నించినప్పటికీ.. తనకు ఆల్రెడీ ఒకరున్నారని అరియానా చెప్పడంతో.. వారి ట్రాక్ కాస్తా ఛేంజ్ అయ్యి ఫ్రెండ్షిప్ పట్టాలెక్కింది. ఇద్దరూ మంచి స్నేహితుల్లా మెలిగారు. బయట మిత్రుల్లాగానే వీరు హౌస్ లో మెదలడంతో ఈ జంటకు మంచి ఇంప్రెషన్ ఏర్పడింది.

చిన్న చిన్న విషయాలకే ఈ ఇద్దరూ గొడవ పడుతూ.. మళ్లీ వెంటనే కలిసిపోయేవారు. ‘ఆంటీ, ముసలిదాన’ అంటూ అరియానాను అవినాష్ ఏడిపిస్తే.. ‘అంకుల్, పొట్ట’ అంటూ అరియానా అవినాష్‌ను టీజ్ చేసేది. అయితే.. అవినాష్ వెళ్లిపోవడంతో ‘నువ్ లేకపోతే ఏదోలా ఉంది.. నువ్ లేవని మాట్లాడటమే మానేశాను.. నువ్ వెళ్లిపోయాకే నీ విలువ తెలిసింది’ అంటూ ఎమోషనల్ అయ్యింది అరియానా. ‘మనషులు దూరమైతేనే విలువ తెలుస్తుంది అరియానా’ అంటూ అవినాష్ కూడా ఎమోషనల్ అయ్యాడు. వీరి ఎమోషన్ కు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారు.

సీన్ కట్ చేస్తే.. బిగ్ బాస్ 4 ముగిసింది. కానీ.. వీరి ఫ్రెండ్షిప్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. వీరిద్దరినీ వివిధ టీవీ షోలకు పిలుస్తున్నారు. అవినాష్, అరియానా కూడా జంటగా వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వీరిద్దరితో ఓ షో ప్లాన్ చేయడానికి టీవీ ఛానళ్లు చూస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి, ఇదే నిజమైతే.. త్వరలో అవినాష్, అరియానా కలిసి ఒక టీవీ షో చేయడాన్ని ప్రేక్షకులు చూడొచ్చు. వీరి ఫ్రెండ్షిప్ మిస్ కాకుండా చూడొచ్చు. మరి, ఏం జరుగుతందనేది చూడాలి.