Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అలా ప్లాన్ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   31 March 2021 7:43 AM GMT
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అలా ప్లాన్ చేస్తున్నారా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్' ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్న మేకర్స్.. థియేటర్స్ లో ట్రైలర్ రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో ఏప్రిల్ 3న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ప్రొడ్యూసర్ ప్లాన్ చేసుకున్నాడు. దీనికి హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ ని వేదికగా ఎంపిక చేసుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో పబ్లిక్ గ్యాదరింగ్స్ ర్యాలీలకు పర్మిషన్స్ నిరాకరిస్తున్న తెలంగాణా ప్రభుత్వం 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతి ఇవ్వలేదు. దీనికి తోడు అదే రోజు పవన్ తిరుపతిలో పొలిటికల్ మీటింగ్ కి అటెండ్ కావలసి ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ 'వకీల్ సాబ్' ఈవెంట్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 4న 'వకీల్ సాబ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారట. కేవలం సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణులు మాత్రమే హాజరయ్యేలా హైటెక్స్ లో 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చూస్తున్నారని సమాచారం. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ హాజరయ్యే ఈ సినిమా ఈవెంట్ ని టెలివిజన్ న్యూస్ ఛానల్స్ ద్వారా అభిమానులు వీక్షించే అవకాశం కల్పించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన 'వకీల్ సాబ్' చిత్రాన్ని దిల్ రాజు - బోనీ కపూర్ కలిసి నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా.నటించగా.. నివేదా థామస్ - అంజలి - అనన్య కీలక పాత్రలు పోషించారు.