Begin typing your search above and press return to search.

RRR కలసి కొత్త 'OTT' ప్లాన్ చేస్తున్నారా..??

By:  Tupaki Desk   |   6 July 2021 10:30 AM GMT
RRR కలసి కొత్త OTT ప్లాన్ చేస్తున్నారా..??
X
డిజిటల్ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులకు ఓటీటీ వేదికలు శ్రీకారం చుట్టాయి. వినోదం కోరుకునేవారు తమకు ఇష్టమొచ్చిన మధ్యమాలలో నచ్చిన కంటెంట్ ను వీక్షించడానికి ఓటీటీలు ఫ్లాట్ ఫార్మ్స్ అవకాశం కల్పిస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో థియేట‌ర్స్ మూతబడటంతో ప్రేక్షకులకు ఓటీటీలు ప్ర‌త్యామ్నాయంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సత్తా చాటుతున్న ఓటీటీలతో పాటుగా.. కొత్తగా మరిన్ని ఓటీటీలు - ఏటీటీలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త స్ట్రాటజీలతో వీక్షకులను ఆకట్టుకుంటూ సబ్ స్క్రైబర్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఓటీటీనే పెద్ద బిజినెస్ అని భావించిన చాలామంది ఔత్సాహికులు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో 'RRR' ఓటీటీ రాబోతోందని టాక్ నడుస్తోంది.


తెలుగు కంటెంట్ ని అందించడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో - నెట్ ఫ్లిక్స్ - డిస్నీ+హాట్ స్టార్ - సన్ NXT - జీ 5 వంటి ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ - మై హోమ్ గ్రూప్ రామ్ కలిసి 100% తెలుగు ఓటీటీ అంటూ ''ఆహా'' ను లాంచ్ చేశారు. అలానే యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ''స్పార్క్'' అనే ఓటీటీని ప్రారంభించారు. ఈ క్రమంలో 'RRR' వంటి ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్న దర్శకుడు రాజమౌళి మరియు హీరోలు జూ.ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలసి ఇప్పుడు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

రాజమౌళి - రామారావు - రాంచరణ్.. ముగ్గురూ కలిసి తెలుగులో సరికొత్త OTT పెట్టి పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలని చూస్తున్నారట. వీరి పేర్ల మీదుగా వచ్చిన 'RRR' టైటిల్, ఒక బ్రాండ్ నేమ్ గా అవతరించిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు అదే పేరుతో ఓటీటీ ప్రారంభించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇది నిజమా లేదా ఒట్టి పుకారేనా అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఓటీటీలే రాజ్యమేలే అవకాశం ఉందని చాలామంది నమ్ముతున్నారు కాబట్టి.. RRR కలిసి ఓటీటీ వ్యాపారంలోకి ఎంటర్ అవుతారేమో చూడాలి.

ఇక 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విషయానికొస్తే.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. కేవలం రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉండగా.. ఆగస్ట్ నెలాఖరుకు చిత్రీకరణ చేయాలని రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేసుకుంటున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆలియా భట్ - ఒలివియా మోరిష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే 'RRR' విడుదల తేదీపై క్లారిటీ రానుంది.