Begin typing your search above and press return to search.

చరణ్‌ ను సీఎంగా చూడబోతున్నామా?

By:  Tupaki Desk   |   19 July 2021 5:49 AM GMT
చరణ్‌ ను సీఎంగా చూడబోతున్నామా?
X
మెగా అభిమానులు చరణ్‌ ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కోసం ఎంతగా అయితే ఎదురు చూస్తున్నారో అంతకు మించి శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్‌ లో శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా టెక్నీషియన్స్ ను ఎంపిక చేయడంతో పాటు నటీనటుల ఎంపిక చేస్తున్నారు. సినిమా షూటింగ్‌ ను అతి త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దిల్‌ రాజు కాంపౌండ్‌ నుండి సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే సినిమా గురించి రోజుకో వార్త అన్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ సినిమా కథ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. శంకర్ సినిమా అంటే సోషల్‌ మెసేజ్‌ ఉంటుందని అంతా నమ్ముతున్నారు. ఈ సినిమాలో కూడా కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్‌ ను కూడా శంకర్‌ ఇవ్వబోతున్నాడు అంటున్నారు. ఈ సినిమా కథ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర కొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు శంకర్‌ ఈ సినిమాలో చరణ్‌ ను యువ సీఎంగా చూపించబోతున్నాడు అంటున్నారు. ఒకే ఒక్కడు సినిమా తరహాలో ఈ సినిమా కథ ఉంటుందని.. పొలిటికల్ బ్యాక్‌ డ్రాప్ తో రూపొందబోతున్న ఈ సినిమాలో చరణ్‌ పాత్ర యువతను ఆకట్టుకునే విధంగా ఉంటుందట.

ఒక సామన్య కుటుంబంకు చెందిన హీరో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకుంటాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన చేసే పనుల వల్ల అనూహ్యంగా సీఎం అయ్యే అవకాశం వస్తుంది. ఆ అవకాశం ఎలా వస్తుంది.. ఎందుకు వస్తుంది అనేది కథ అని.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆ యువకుడు ఎదుర్కొన్న సవాళ్లు తీసుకు వచ్చిన మార్పు ఏంటీ అనేది సినిమాలో చూపించబోతున్నారు. అద్బుతమైన స్క్రీన్‌ తో పాటు భారీతనంను సినిమాలో చూపించబోతున్నారు. శంకర్‌ సినిమా అంటే కేవలం తెలుగు.. తమిళ భాషల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వడంతో పాటు భారీ వసూళ్లను నమోదు చేస్తుందనే నమ్మకంను మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

దిల్‌ రాజు బ్యానర్‌ కు ఇది ఒక ప్రత్యేకమైన సినిమా గా చెబుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా చరణ్‌ ను దర్శకుడు శంకర్‌ సీఎంగా చూపిస్తే ఖచ్చితంగా ఇది మరో పక్కా కమర్షియల్‌ పాన్‌ ఇండియా సినిమా గా నిలుస్తుందనే నమ్మకంను విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చరణ్‌ కు జోడీగా నటించబోతున్న హీరోయిన్‌ ఎవరు అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు సాయి మాధవ్‌ బుర్రా మాటలు అందిస్తుండగా.. జానీ మాస్టర్‌ చరణ్‌ తో స్టెప్పులు వేయించబోతున్నాడు.

శంకర్‌ ఈ సినిమాను ఏళ్లకు ఏళ్లు తెరకెక్కించకుండా వచ్చే ఏడాది వరకు పూర్తి చేయాలనే ఒప్పందంతో రంగంలోకి దిగబోతున్నాడు. చరణ్‌.. శంకర్ ల మూవీ అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2023 సంవత్సరం ఆరంభంలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. మరో వైపు చరణ్‌ నటిస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌ లో దసరా కానుకగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఇక ఆచార్య సినిమా లో కూడా చరణ్‌ కీలక పాత్రలో కనిపించాడు. ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఇదే ఏడాది ఆచార్య కూడా రాబోతుంది. మెగా అభిమానులకు బ్యాక్ టు బ్యాక్‌ చరణ్‌ సినిమాల పండుగ ఖాయమంటూ టాక్ వినిపిస్తుంది.