Begin typing your search above and press return to search.

అన్ స్టాప‌బుల్ స‌క్సెస్ కి కార‌ణం వారేనా?

By:  Tupaki Desk   |   16 Nov 2022 2:30 AM GMT
అన్ స్టాప‌బుల్ స‌క్సెస్ కి కార‌ణం వారేనా?
X
వెండితెర‌పై మెరుపులు మెరిపిస్తూ ప్ర‌త్య‌ర్థుల్ని హ‌డ‌లెత్తించే నంద‌మూరి బాల‌కృష్ణ ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఎవ‌రూ ఊహించి వుండ‌రు. కానీ అలాంటి అసాధ్యం అనుకున్న దాన్ని `ఆహా` ఓటీటీ సుసాధ్యం చేసి చూపించి ఔరా అనిపించింది. నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా `ఆహా` ఓటీటీ మొద‌లు పెట్టిన టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె`. ఊహించ‌ని విధంగా ఈ టాక్ షో `ఆహా`లోనే కాకుండా ఇండియ‌న్ టాక్ షోల్లో వ‌న్ ఆఫ్ ద బెస్ట్ టాక్ షోగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుంది.

ఐఎండీబీ రేటింగ్స్ లోనూ అదుర్స్ అనిపించుకుని టాప్ రేటింగ్ ని సొంతం చేసుకుని ఔరా అనిపించింది. ఈ షోకు ముందు బాల‌య్య టాక్ షో చేయ‌డం ఏంటీ? అని ప్ర‌శ్నించిన వాళ్లే ఇప్ప‌డు షోలో ఆయన స్టైల్‌, త‌నదైన స్టైల్లో సెల‌బ్రిటీల‌ని ఆట‌ప‌ట్టిస్తున్న తీరుకు ఫిదా అయిపోతున్నారు. షోకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ టాక్ షో త‌రువాత చాలా మందిలో వున్న అపోహ‌ల‌న్నీ తొల‌గిపోయాయి. షోలోకి ఎంట‌రైన వారు కూడా బాల‌య్య‌లో వున్న కొత్త యాంగిల్ ని చూసి ముచ్చ‌ప‌డుతున్నారు.

బాల‌య్య‌తో క‌లిసి షోలో గోల చేస్తున్నారు. రీసెంట్ గా యంగ్ హీరోలు శ‌ర్వానంద్‌, అడివి శేష్ చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు. చివ‌రికి బాల‌య్యే మిమ్మ‌ల్ని ఈ షోకి అస్స‌లు పిల‌వాల్సింది కాదు అనేంత‌గా బాల‌య్ తో క‌లిసి ఈ ఇద్ద‌రు హీరోలు స‌ర‌దాగా అల్ల‌రి చేసిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ విశేషంగా అల‌రించి బాల‌య్య ఎంత సీరియ‌స్ గా వుంటారో అంత స‌రదా మ‌నిషి అని ఈ టాక్ షో నిరూపించింది. అయితే ఈ షో అనుకున్న స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం వెన‌క చాలా మంది టీమ్ శ్ర‌మ వుంద‌ని తెలుస్తోంది.

కెమెరా ముందు బాల‌య్య అంత సెటిల్డ్ గా జోవియ‌ల్ గా సెల‌బ్రిటీలతో వ్య‌వ‌హ‌రించ‌డానికి తెర వెనుక టీమ్ చేస్తున్న క‌ఠోర‌మైన కృషే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. గ‌తంలో బాల‌య్య‌కున్న ఇమేజ్ కి ఈ షో త‌రువాత ఏర్ప‌డిన ఫాలోయింగ్ కి చాలా మార్పులొచ్చాయ‌ని, ఆయ‌న ఫ్యామిలీస్ కి, యూత్ కి ఈ షో త‌రువాత మ‌రింత ద‌గ్గ‌ర‌య్యార‌ని తెలుస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం తెర వెన‌క వున్న టీమ్ అని చెబుతున్నారు.

ఇక ఈ షో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం టీమ్ సెలెక్టీవ్ గా కాంబినేష‌న్ ల‌ని సెట్ చేస్తూ వైర‌ల్ అయ్యే గెస్ట్ ల‌ని జంట‌గా తీసుకురావ‌డంతో పాటు వారికి సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాల‌ని జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకుని బాల‌య్య‌కు అందించ‌డం వ‌ల్లే ఇంత వ‌ర‌కు ఏ షోలోనూ బ‌య‌టికి రాని విష‌యాల‌న్నీ బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. త్వ‌ర‌లో చిరంజీవి - ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ - అల్లు అర్జున్ - స‌మంత - ర‌ష్మిక మంద‌న్న వంటి కాంబినేష‌న్స్ వ‌స్తే షో మ‌రింత హైలైట్ అవుతుంద‌ని ఆడియ‌న్స్ కోరుకుంటున్నార‌ట. మ‌రి దీనిపై టీమ్ ఎలాంటి క‌స‌ర‌త్తు చేస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.