Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎత్తేసాక జ‌నాల్ని థియేట‌ర్ల‌కి ర‌ప్పించ‌డానికి వారే కీల‌కం కానున్నారా...?

By:  Tupaki Desk   |   18 April 2020 11:00 AM IST
లాక్ డౌన్ ఎత్తేసాక జ‌నాల్ని థియేట‌ర్ల‌కి ర‌ప్పించ‌డానికి వారే కీల‌కం కానున్నారా...?
X
సినీ ఇండస్ట్రీ అంటే మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీ అని అందరికి తెలిసిన విషయమే. వాస్తవానికి చాలా సినిమాల్లో హీరో పాత్రకి ఈక్వల్ గా హీరోయిన్ రోల్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. కొన్ని సినిమాలు సూపర్ హిట్స్ కావడానికి హీరోయిన్లే ముఖ్య కారణం అవుతారు. అలాంటి సినిమాలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. ఒక సినిమా విజయం సాధించడానికి డైరెక్టర్.. స్టోరీ.. హీరో.. ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం. కొన్ని సినిమాల్లో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ లేకపోతే వాటి రిజల్ట్స్ ఎలా ఉండేవే మనం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాం. ఒక సినిమాలో హీరో వచ్చి ఎంత గొప్ప మెసేజ్ ఇచ్చినా చివరికి ఆయన పక్కన హీరోయిన్ లేకపోతే ప్రేక్షకులు ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కమెర్షియల్ సినిమా అయినా... మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అయినా దానికి హీరోయిన్ గ్లామర్ యాడ్ అవ్వకపోతే అది కమెర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వదని మన నిర్మాతలకి తెలుసు. హీరోయిన్ లేకుండా హిట్ అయిన సినిమాలు ఉన్నప్పటికీ అవి చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది.

కానీ ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్ప‌కోక‌పోయినా.. హీరో ప‌క్క‌న హీరోయిన్ లేకుంటే ఆ లోటు క‌చ్చితంగా సినిమా క‌లెక్ష‌న్స్ లో కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా చాలా కష్టాలు అనుభవిస్తోంది. ఈ సంక్షోభం నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మల్టీపెక్స్ మూసేసారు. ఇప్పుడు తాజాగా లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించడంతో ఇప్పట్లో సినిమా బయటకి వచ్చే అవకాశం లేదని అర్థం అవుతోంది. కరోనా ప్రభావం తగ్గి ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత తేలికైన విషయం కాదని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసాక సినిమా క‌లెక్ష‌న్స్ కు.. థియేట‌ర్ల‌కి జ‌నాల్ని ర‌ప్పించ‌డానికి హీరోయిన్లు చాలా కీల‌కం కానున్నారు. అయితే లాక్ డౌన్ త‌రువాత వ‌చ్చే సినిమాల్లో కింద సెంట‌ర్స్ లో ఉన్న మాస్ ఆడియెన్స్ ని.. హై క్లాస్ లో కూర్చునే ర‌సిక ప్రియుల్ని ఆక‌ట్ట‌కునే హీరోయిన్లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. సింపుల్ గా చెప్పాలంటే సినిమాల్లో ఎంత మంచి కంటెంట్ ఉన్నా గ్లామ‌ర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం నిర్మాత ఆ కాస్త న‌ష్టాన్ని భ‌రించాల్సిందే. ఇంకో విష‌యం ఏంటంటే హీరోయిన్ల పోస్ట‌ర్లు ప‌డితేనే మాస్ ఆడియెన్స్ ను థియేట‌ర్స్ కు ర‌ప్పించ‌గ‌లం అనే ప‌బ్లిసిటీ సూత్రం ఇక్క‌డ చాలా మంది సీనియ‌న్ నిర్మాత‌ల‌కు తెలుసు. కానీ హీరోల ఈగోలు శాటిస్ ఫై చేయ‌డానికి వారి మీద‌నే ఫోక‌స్ ఎక్కువు పెట్టి ప్ర‌మోష‌న్స్ చేయిస్తుంటారు. ఈ ప‌ద్ధ‌తి లాక్ డౌన్ త‌రువాతైనా మారిస్తే ఇండ‌స్ట్రీకి నాలుగు డ‌బ్బులు వ‌స్తాయని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.