Begin typing your search above and press return to search.
ఆ దర్శకుడి ప్రాజెక్ట్స్ కి అవాంతరాలు ఎదురవుతున్నాయా...?
By: Tupaki Desk | 3 Sept 2020 4:00 PM IST'గమ్యం' సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గమ్యాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఈ క్రమంలో 'కృష్ణం వందే జగద్గురుమ్' 'వేదం' చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 'గబ్బర్' సినిమాతో బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు. ఇక 'కంచె' సినిమాతో ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో స్టార్ డైరెక్టరుగా పేరు తెచ్చుకున్నారు. కాకపోతే ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాలు పరాజయం చెందడంతో రేస్ లో కాస్త వెనుకబడిపోయాడు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రాన్ని లైన్ లో పెట్టాడు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ.ఎమ్. రత్నం నిర్మిస్తున్నారు. అయితే క్రిష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే క్రమంలో అనేక అవాంతరాలు ఎదురవుతుంటాయని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తుంటాయి.
కాగా, కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా క్రిష్ సినిమాలను అనుకోని అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి. షూటింగ్ దశలో ఉన్నప్పుడో.. చిత్రీకరణ పూర్తై రిలీజయ్యే లోపు ఏదొక విధంగా అవాంతరాలు వచ్చి పడుతుంటాయి. అయితే ప్రస్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమాల విషయంలో కూడా అవాంతరాలు ఎదురవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పవన్ తో సినిమాని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనుకున్న క్రిష్ కి 15 రోజుల షూటింగ్ జరిపిన తర్వాత కరోనా మహమ్మారి అడ్డుతగిలింది. దీంతో ఐదు నెలల సమయం వృధాగా పోయింది. ఇప్పుడు పవన్ ముందుగా 'వకీల్ సాబ్' షూట్ కంప్లీట్ చేసిన తర్వాతే తదుపరి సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. దీంతో ఈ గ్యాప్ లో ఓ ప్రాజెక్ట్ చేయొచ్చని మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ తో సినిమా మొదలు పెట్టాడు క్రిష్. 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ని నవంబర్ ఫస్ట్ వీక్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు కొన్ని అనుకోని కారణాల వల్ల వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి బ్రేక్ పడిందట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కాని మరో వైపు క్రైసిస్ కారణంగా పవన్ ప్రాజెక్ట్ బడ్జెట్ విషయంలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది.