Begin typing your search above and press return to search.

‘సర్కారు వారి పాట’ చూస్తే.. పొట్ట చెక్కలేనట!

By:  Tupaki Desk   |   28 Dec 2020 4:30 AM GMT
‘సర్కారు వారి పాట’ చూస్తే.. పొట్ట చెక్కలేనట!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ‘గీతా గోవిందం’ చిత్రంతో క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకుడు పరుశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

చాలా కాలంగా మాస్ సినిమాలే చేసిన ప్రిన్స్.. ఈ మూవీలో లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం మహేష్ తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు. ఇప్పటికే తన లుక్ ను చాలా వరకు మార్చుకున్నాడు ఈ మిల్కీ బాయ్. చాలా కాలం తర్వాత మహేష్ ప్రేమికుడిగా కనిపిచబోతుండడంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

కాగా.. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో డైరెక్టర్ పరశురామ్ డీసెంట్ కామెడీ ట్రాక్ ను రాశాడని సమాచారం. ఈ సీన్ వెన్నెల కిషోర్, పోసాని మధ్య ఉంటుందట. ఈ కామెడీ ట్రాక్ మొత్తం సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందనే మాట వినిపిస్తోంది. ఈ కామెడీ ట్రాక్ మొత్తం సెకెండ్ హాఫ్ లో వస్తోందట. అంతేకాకుండా.. ఈ మేజర్ సీన్ లో అనసూయ కూడా ఉంటుందట. వీళ్ళ ముగ్గురి మధ్య ఫుల్ కన్ ఫ్యూజన్ డ్రామా ఉంటుందని తెలుస్తోంది.

అదేవిధంగా.. ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని చెబుతున్నారు. అన్నిటికీ మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌ గా కనిపించబోతుండడంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.