Begin typing your search above and press return to search.

థియేట‌ర్లు ఇక క‌ళ్యాణ మంట‌పాలు కాంప్లెక్సులేనా?

By:  Tupaki Desk   |   1 July 2021 5:00 PM IST
థియేట‌ర్లు ఇక క‌ళ్యాణ మంట‌పాలు కాంప్లెక్సులేనా?
X
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3000 థియేట‌ర్లు ఉండేవ‌ని ఒక‌ప్పుడు గొప్ప‌గా చెప్పుకునేవారు. కాల‌క్ర‌మంలో 1700 కి థియేట‌ర్ల సంఖ్య ప‌డిపోయింది. అంటే స‌గానికి స‌గం క‌ళ్యాణ మంట‌పాలు ఫంక్ష‌న్ హాళ్లుగా మారిపోయాయ‌ని ఎగ్జిబిట‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలున్నాయి.

ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి స‌న్నివేశం దాపురించ‌నుందా? అంటే అవున‌నే సందిగ్ధ‌త‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సెకండ్ వేవ్ వెళితే థ‌ర్డ్ వేవ్.. అదీ వెళితే ఫోర్త్ వేవ్ అంటూ భ‌య‌పెట్టేస్తున్నారు. ఆద‌మ‌రిస్తే అమ్మోరు వేంచేస్తోంది. ఇలా అయితే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చేదెలా? సినిమా చూసేదెప్పుడు? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది.

ఓవైపు ఓటీటీల్లో క్రేజీ సినిమాలు రిలీజైపోతున్నాయి. నార‌ప్ప - విరాఠ‌ఫ‌ర్వం- మ్యాస్ట్రో- దృశ్యం 2 ఇలా పేరున్న హీరోలు న‌టించిన సినిమాలు ఓటీటీల‌కు అమ్మేస్తుంటే అగ్ర బ్యాన‌ర్లు సైతం ఓటీటీల‌కు బెండ్ అయిపోతుంటే ఇక థియేట‌ర్ల‌కు కంటెంట్ ఇచ్చేదెవ‌రు? అన్న ఆందోళ‌న‌ నెల‌కొంది. ఎగ్జిబిట‌ర్లలో కంగారు మొద‌లై తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌ను తెరిచేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు త‌మ డిమాండ్లు నెర‌వేర్చాల‌ని ప‌ట్టుబ‌ట్టి కూచుకున్న ఎగ్జిబిట‌ర్లు ఎట్ట‌కేల‌కు దిగొచ్చి థియేట‌ర్లు ఓపెన్ చేసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌లి స‌మావేశాల్లో జూలై 10 నుంచి ఏపీలో థియేట‌ర్లు తెర‌వాలన్న ఆలోచ‌న వ్య‌క్తమైంద‌ట‌. మ‌రో 10-15రోజుల్లో తెరిచేందుకు వీలుంద‌ని తెలుస్తోంది.

అయితే థ‌ర్డ్ వేవ్ అంటూ భ‌య‌ప‌డుతున్న ప్ర‌జ‌లు థియేట‌ర్ల వైపు రాక‌పోతే ప‌రిస్థితేంటి? ఏపీలో ఇప్ప‌టికే టికెట్ రేట్లు త‌గ్గించారు కాబ‌ట్టి గిట్టుబాటు అవ్వ‌డం ఎలా? ఇలా ర‌క‌ర‌కాల సందేహాలు నెల‌కొన్నాయి. మ‌రోవైపు క్రేజున్న సినిమాల్ని వ‌రుస పెట్టి కొనేస్తున్న ఓటీటీలు స్క్రాప్ మూవీస్ జోలికి వెళ్ల‌డం లేదు. అలాటివి థియేట‌ర్ల‌లోకి వ‌స్తే జ‌నం వెళ‌తారా? అన్నది సందిగ్ధ‌మే. ఓటీటీలు చిన్న సినిమాల్ని వ‌దిలేసి పెద్ద సినిమాల‌ను మాత్రమే కొనుక్కుంటున్నాయి. కార‌ణం ఏదైనా కానీ థియేట‌ర్ల‌కు వ‌చ్చేవాళ్లు లేక‌పోతే వాటిని క‌ళ్యాణ మంట‌పాలు- ఫంక్ష‌న్ హాళ్లుగా మార్చ‌డం మిన‌హా వేరే ఆప్ష‌నే లేదు.