Begin typing your search above and press return to search.
ప్రొడ్యూసర్స్ ఆ విషయంలో పట్టుకోల్పోతున్నారా?
By: Tupaki Desk | 25 July 2022 4:30 PM GMTగత కొంత కాలంగా తెలుగు సినిమా బడ్జెట్ లు ఆకాశాన్నంటుతున్నాయి. పాన్ ఇండియా సినిమాల పరంపర మొదలు కావడంతో అది కాస్తా ఇప్పడు వందల కోట్లకు చేరింది. దానికి తోడు అనవరస ఖర్చులు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. కరోనా కారణంగా సినిమాల షూటింగ్ లు ఆగిపోవడం.. మళ్లీ రీస్టార్ట్ కావడం వల్ల నిర్మాతలకు వడ్డీ రేట్లు పెరిగిపోవడం భారంగా మారింది. అంతే కాకుండా స్టార్ లు, ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ లు కూడా ఊహించని స్థాయికి చేరడం కూడా ఇప్పడు నిర్మాతలని వేధిస్తున్నాయి.
దీనికి తోడు స్టార్ హీరోలతో పాటు దర్శకులు కూడా తమ పారితోషికాలని భారీగా పెంచేసి షాకుల మీద షాకులిస్తున్నారు. ఈ ఇద్దరి వల్లే ఇప్పుడు సినిమాల బడ్జెట్ హద్దులు దాటేసి వంద కోట్లకు చేరుకుంటోంది.
స్టార్ హీరోల సినిమాల నుంచి మీడియం రేంజి సినిమాల వరకు ఇదే పరిస్థితి. దీంతో బడ్జెట్ లు నిర్మాతల చేయిదాటిపోతున్నాయి. ఎంతగా అదుపు చేయాలని ప్రయత్నించినా స్టార్ ల కారణంగా అది హద్దుల దాటేస్తోంది.
నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా తెలుగు సినిమాకు రికార్డు స్థాయి మార్కెట్ క్రియేట్ అయింది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్న స్టార్ హీరోలు, డైరెక్టర్లు దానికి తగ్గట్టే పారితోషికాల లెక్కలు వేస్తున్నారు. ఇదే ఇప్పడు నిర్మాతల పాలిట శాపంగా మారుతోంది. స్టార్‌లని, స్టార్ డైరెక్టర్లని కాదని నిర్మాతలు ఏమీ చేయలేరు. దీంతో వారి కారణంగా పెరుగుతున్న బడ్జెట్ ని నిర్మాతలు అదుపు చేయలేక చేతులు ఎత్తేస్తున్నారట.
ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, వారి కారవాన్ ఖర్చులు, వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయట. హీరోయిన్ ల విషయంలోనూ ఇదే జరుగుతోంది. వారి రెమ్యునరేషన్ లతో పాటు వారి వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా భారీగా చార్జ్ చేస్తుండటంతో నిర్మాతలకు అది కూడా భారంగా పరిణమించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు లక్షల్లో వుండటంతో అవి నేను భరించలేనని ఓ నిర్మాత చేతులు ఎత్తేయడం తెలిసిందే.
ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గంటలు, రోజులు లెక్కన గతంలో పోలీస్తే నాలుగు రెట్లు వసూలు చేస్తుండటం కూడా నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఫారిన్ టూర్ ల వల్ల కూడా భారీగా వృధా ఖర్చు అవుతోందట. టాలీవుడ్ ఆర్టిస్ట్ లు, స్టార్ హీరోయిన్ ల విషయంలో అనవర ఖర్చు పెట్టాల్సి వస్తోందట. ఇంత జరుగుతున్నా నిర్మాతలు కట్టడి చేయలేక పోతుండటంతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ బడ్జెట్ పై పట్టుకోల్పోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.