Begin typing your search above and press return to search.

నలుగురు భామతో యంగ్ హీరో ఎఫైర్

By:  Tupaki Desk   |   11 May 2019 10:42 AM GMT
నలుగురు భామతో యంగ్ హీరో ఎఫైర్
X
యువహీరోలతో కథానాయికల లింకప్ వార్తలు రెగ్యులర్ గా వింటున్నవే. చాక్లెట్ బోయ్ రణబీర్ కపూర్ వరుసగా నాయికలతో ఎఫైర్లు సాగించి అటుపై బ్రేకప్ చెప్పేయడంలో ఘనాపాటిగా పాపులరయ్యాడు. ఇటు దక్షిణాదిన అదే కేటిగిరీలో హీరో సిద్ధార్థ్ పేరు పాపులరైంది. అయితే ప్రస్తుతం ఆ ఇద్దరినీ మించి యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేమాయణాలు ఇండస్ట్రీని వేడెక్కిస్తున్నాయ్.

సుశాంత్ సింగ్ కి రణబీర్ .. సిద్ధార్థ్ తరహాలోనే గాళ్స్ లో విపరీతమైన క్రేజు ఉంది. కథానాయికలు అతడి ఫ్లిర్టింగ్ కి దారిలోకి వచ్చేస్తున్నారట. ఇప్పటికే నలుగురు హాట్ బ్యూటీస్ అతడితో డేటింగ్ చేయడం వాడి వేడిగా చర్చకు వచ్చింది. తొలుత ఈ అందగాడితో టీవీ నటి అంకిత లోఖండే దాదాపు పదేళ్ల పాటు డేటింగ్ సాగించింది. అటుపై `రాబ్తా` టైమ్ లో సుశాంత్ లవ్ వేరొక బ్యూటీకి షిఫ్టయ్యింది. రాబ్తా చిత్రీకరణలో ఉన్న సమయంలో కోస్టార్.. 1 నేనొక్కడినే బ్యూటీ కృతి సనోన్ తో సీరియస్ గా ఎఫైర్ సాగిస్తున్నాడని ప్రచారమైంది. ఇటీవలే కేదార్ నాథ్ టైమ్ లోనూ సైఫ్ ఖాన్ వారసురాలు సారా అలీఖాన్ తో మనోడు నిండా ప్రేమలో మునిగాడని ముచ్చటించుకున్నారు. సారా ఖాన్ ఓ మిడ్ నైట్ వేళ సుశాంత్ కి బర్త్ డే కేక్ కట్ చేసి హంగామా చేయడంపై అప్పట్లో కథనాలు వచ్చాయి.

తాజాగా సుశాంత్ ఖాతాలో మరో కొత్త పేరు వినిపిస్తోంది. తూనీగ తూనీగ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రియా చక్రవర్తి ప్రస్తుతం ఈ యంగ్ హీరోతో డీప్ లవ్ లో ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇదివరకూ ఓసారి రియా సుశాంత్ ఇంటి నుంచి బయటకు వస్తూ మీడియా కంటికి చిక్కింది. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్యా సీక్రెట్ గా ఏదో నడుస్తోంది అంటూ ఒకటే ఠాంఠాం మోగుతోంది. సుశాంత్ సింగ్ కి చెందిన లోనవాలా ఇంటికి రియా రెగ్యులర్ గా విజిట్ చేస్తోంది. అసలేం జరుగుతోంది? అని తననే ప్రశ్నిస్తే మాత్రం కేవలం గుడ్ ఫ్రెండ్స్ అంటూ కవర్ చేసేస్తోంది. అయితే అంతకుమించి ఇంకేదో జరుగుతోంది అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు వండి వారుస్తోంది. సుశాంత్ సింగ్ ప్రస్తుతం చిచోర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. రియా చక్రవర్తి ఈ చిత్రంలో ఇమ్రాన్ హస్మి సరసన నటిస్తోంది. అమితాబ్ ఈ చిత్రంలో మరో కథానాయకుడిగా నటిస్తున్నారు.