Begin typing your search above and press return to search.

కియారా ఆ హీరోతో డేటింగ్ చేస్తోందట!

By:  Tupaki Desk   |   2 Aug 2018 7:51 AM GMT
కియారా ఆ హీరోతో డేటింగ్ చేస్తోందట!
X
మన్మథుడు సినిమాలో బ్రహ్మానందం నాగార్జునతో "ఇది ఇండియా కాదు ప్యారిస్. ఇండియా ని టేప్ రికార్డర్లో పెట్టి 50 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కితే ఎలా ఉంటుందో ప్యారిస్ అలా ఉంటుంది అంటాడు." దాని సంగతేమో కానీ మన టాలీవుడ్ ని ఇరవై ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్ద్ నొక్కితే అది బాలీవుడ్. ఇది సినిమాల కంటెంట్ కంపారిజన్ కాదు. అక్కడుండే జనాలకు మన జనాలకు తేడా. మరి అక్కడినుండి ఇంపోర్ట్ అయిన బ్యూటీలు కూడా అదే స్పీడ్ తో ఉంటారు కదా.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అందరూ క్యూట్ - స్వీట్ అనుకునేలోపు 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సీరీస్ తో అందరికీ హోల్ సేల్ గా షాక్ ఇచ్చింది. 'వైబ్రేటర్ తో స్వయంగా భావప్రాప్తి' పొందే ఒక సీన్ ను అధ్బుతంగా చేసినందుకు ఈ అమ్మడి పేరు సోషల్ మీడియా లో మార్మోగి పోయింది. ఏంటీ పచ్చిగా వైబ్రేటర్.. భావప్రాప్తి అనే పదాల ప్రస్తావన.. అంటారా? అదేకదా ఇందాక మనం అనుకున్నది! మనల్ని 20 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే అది బాలీవుడ్. ఇప్పుడు చెప్పండి.. ఆ అమ్మడు ఆ సీను చెయ్యడంలో లేని మొహమాటం మనకు దానిగురించి మాట్లాడుకోవడం లో ఉంటే ఎలా?

సరే.. అసలు విషయం లోకొస్తే ఇప్పుడు కియారా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తో లవ్ లో పడిందని, డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇంతకీ అయన గారి సంగతేంటంటే.. అలియా భట్ తో ప్రేమాయణం నడిపాడు.. ఆ తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో లవ్ స్టొరీ.. ఇప్పుడు కియారా వంతు వచ్చింది. ముంబై లో అంతే.. ముంబైలో అంతే అంటూ సరిపెట్టుకుందాం. అంతకంటే ఏం చేస్తాం?