Begin typing your search above and press return to search.

ఓటీటీ డీల్స్ విషయంలో ప్రొడ్యూసర్స్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారా..?

By:  Tupaki Desk   |   20 Jun 2020 5:00 AM IST
ఓటీటీ డీల్స్ విషయంలో ప్రొడ్యూసర్స్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారా..?
X
డిజిటల్ వరల్డ్ లో ఓటీటీలు ఎంటర్ అయినప్పటి నుండి అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం వీటి వైపే చూస్తున్నారు. కరోనా మహమ్మారి వలన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా ఓ రేంజ్ లో ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్స్ ఇప్పుడల్లా రీ ఓపెన్ చేసే ఉద్దేశ్యం లేదని భావిస్తున్న నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీల్లో సినిమాలు డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు బాగానే ఉంది. కానీ ఓటీటీల మీద ఆధార‌ప‌డ‌టం మొద‌లైయ్యాక వ‌చ్చే క‌ష్టాలు ఆలోచిస్తే మాత్రం ఇండ‌స్ట్రీకి మంచి రోజులు పోయిన‌ట్లే అని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఓటీటీలు థియేట‌ర్ వ్యూయ‌ర్ షిప్ ని త‌గ్గించ‌డానికి.. నిర్మాత‌ల్ని త‌మవైపు తిప్పుకోవ‌డానికి ఇప్పుడు బాగానే డ‌బ్బులు ఇస్తున్నారు. ఇలా ఫ్యాన్సీ రేట్స్ కి సినిమా కొనుక్కోవడం అనేది కొంత కాలం మాత్ర‌మే కొన‌సాగుతుంది. అయితే ఓటీటీలు పెట్టుకున్న బ‌డ్జెట్ టార్గెట్ ముగిసిన తర్వాత అప్ప‌టినుంచి అస‌లు రూల్స్ బ‌య‌ట‌ప‌డ‌తాయని అంటున్నారు.

రాబోయే రోజుల్లో ఓటీటీలు చెప్పిన డేట్ కే సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప‌క్క ఇండస్ట్రీ చిత్రాల‌తో డేట్స్ క్లాష్ వ‌స్తే మ‌న సినిమాలు రిలీజ్ ఆగిపోవాల్సిందే. అలానే ఇప్పుడు సినిమాకి డ‌బ్బులు ఇచ్చిన‌ట్లుగా అప్పుడు ఇచ్చే ప‌రిస్థితులు ఉండకపోవచ్చు. రెవెన్యూ షేరింగులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే ఓటీటీలు పే ప‌ర్ వ్యూ ఈ ప‌ద్ధ‌తిలో 14 రూపాయ‌లు ఇస్తున్నాయి. ఫ్యూచ‌ర్ లో ఇది ఇంకా త‌గ్గిపోవ‌చ్చు. అలానే ఇప్పుడు కూడా నిర్మాత‌లు ఒక మెయిన్ పాయింట్ వ‌దిలేస్తున్నారు. ఏంటంటే అక్ష‌య్ కుమార్ 'ల‌క్ష్మీ బాంబ్' సినిమాను ఉదాహరణగా తీసుకుంటే ఓటీటీ వారు దాదాపు 125 కోట్లు ఇచ్చి కొనుకుంటున్నారట. ఈ సినిమా థియేట‌ర్ లో రిలీజ్ అయితే 300 కోట్లు క‌లెక్ట్ చేయ‌చ్చు లేక‌పోతే 3 కోట్లే లాభాలు తీసుకురావ‌చ్చు. కానీ సినిమా హిట్ అవుతుందో లేదో బేరీజు వేసుకునే క్యాపబిలిటీ నిర్మాత‌ల‌కు ఉంటుంది. సో ఓటీటీ రిలీజ్ వల్ల కూడా నిర్మాతలు నస్టపోయే ఛాన్స్ ఉంది.

అయితే 'పెంగ్విన్' లాంటి సినిమాల విషయంలో నిర్మాతలు కరెక్ట్ గా లెక్కలు వేసుకుంటే నిర్మాత లాభపడొచ్చు. 'పెంగ్విన్' సినిమాను థియేట‌ర్ లో రిలీజ్ చేస్తే పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. ఇప్పుడు కీర్తి సురేశ్ కి ఉన్న రెప్యుటేషన్ ని ఉప‌యోగించి ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసి నిర్మాత‌లు లాభప‌డ్డారు. ఇప్పుడు సినిమా బాగున్నా బాగోలేక‌పోయినా నిర్మాత‌ల‌కు ఓటీటీ నుండి డ‌బ్బులు వ‌చ్చేసాయి. అందుకే నిర్మాత‌లు అన్ని సినిమాలని ఓటీటీ రిలీజుల‌పై ఆధార‌ప‌డితే మాత్రం కష్టమే అనే అభిప్రాయానికి వస్తున్నారు. ఏ సినిమా ఓటీటీ లో రిలీజ్ చేసుకుంటే ప్రాఫిట్స్ వస్తాయో చూసుకొని.. ఇలాంటి డీల్స్ చేయ‌డంలో కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఓటీటీలు వేస్తున్న మాస్ట‌ర్ ప్లాన్స్ నుంచి నిర్మాత‌లు త‌ప్పించుకోవచ్చని ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు.