Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీకి బందిపోట్లుగా పైరసీ సైట్లు

By:  Tupaki Desk   |   15 Aug 2021 5:00 AM IST
సినీ ఇండస్ట్రీకి బందిపోట్లుగా పైరసీ సైట్లు
X
నిత్యం బిజీ లైఫ్లో గడిపే మనుషులకు వినోదాన్నిపంచే సినిమాలను రాను రాను థియేటర్లో చూడలేమా...? సామాజిక పరిస్థితులతో పాటు ఆర్థిక పరిస్థితులు సినిమా వ్యాపారాన్ని దెబ్బతిస్తున్నాయా..? బంధిపోట్ల కంటే ప్రమాదమైన పైరసీ సైట్లు సినిమా పరిశ్రమను దెబ్బతీస్తున్నారా..? వీరి అక్రమ సంపాదన సినిమా నిర్మాతల కంటే ఎక్కువగా ఉంటుందా..? అనే చర్చ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు థియేటర్ల కొరత.. ఇప్పుడు సినిమాను చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కొరత.. ఇలా సినీ పరిశ్రమకు ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు పైరసీ భూతం ఇండస్ట్రీని కుంగదీస్తూ నామారూపాల్లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందా..? అనే వాదనలు పుట్టుకొస్తున్నాయి. ఈ పైరసీ భూతాన్ని అరికట్టేందుకు ఎలాంటి మార్గం వెతకలేమా..? అని కొందరు నటులు సైతం చర్చించుకుంటున్నారు.

పెద్ద స్టార్ సినిమా వచ్చిందంటే థియేటర్లో చిన్నపాటి పండుగ జరిగినట్లే. ప్రేక్షకుల ఆనందానికి అవధులుండవు. వినోదాన్ని పంచడంలో సినిమాకు మించిన వేదిక లేదనే చెప్పొచ్చు. అయితే రూ.200 పెట్టి ఆ వినోదాన్ని ఎవరైనా పొందవచ్చు. కానీ ఆ వినోదాన్ని ప్రేక్షకులకు పంచడానికి సినిమా సిబ్బంది పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. సంవత్సరాల తరబడి నిద్రలేని రాత్రులు గడుపుతూ కాళ్లు, వేళ్లు పట్టుకొని సినిమా తీయాల్సి ఉంటుంది. ఒక్కోసారి అనుకున్న స్థాయిలో సినిమా రాకపోవడంతో మళ్లీ మళ్లీ షూటింగ్ తీయాల్సి ఉంటుంది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కనీసం ఆరు నెలల పాటు వందల కొద్దీ సిబ్బంది శ్రమపడి కోట్ల రుపాయలు వెచ్చిస్తేనే సినిమా పూర్తవుతుంది.

సాంకేతిక టెక్నాలజీతో కొన్ని సౌకర్యాలు సులభమవుతున్నాయి. అయతే సినిమాలను కూడా సులభ తరంలో చూడాలనుకుంటున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల థియేటర్లలో రేట్లు పెంచాల్సి వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు తక్కువ ధరకే ప్రేక్షకులకు కోట్ల రూపాయల సినిమాలను అందిస్తున్నారు. అధికారికంగా కొనుగోలు చేసిన ఓటీటీ వేదిక గురించి మాట్లాడనవసం లేదు. కానీ ఏమాత్రం రూపాయి పెట్టకుండా సినిమాను చూద్దామనుకుంటున్న కొందరు అక్రమ చేష్టల వల్ల సినీ పరిశ్రమ దెబ్బతింటోంది. సినిమా విడుదలయిన మొదటి రోజే టెక్నాలజీని ఉపయోగించి మొత్తం కాపీ చేసేస్తున్నారు.

ఇక ఇలా పైరసీ ద్వారా ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే షాకవుతారు. సినిమాలను, టీవీ షోలను పైరసీ చేసి దాదాపు 10 వేల కోట్ల వరకు సంపాదిస్తున్నారంట. ఈ సంపాదన మార్గం ఎలా వస్తుందో చూద్దాం. ఒక సినిమాలో వెబ్ సైట్లో పెట్టడం ద్వారా ప్రేక్షకులు సినిమాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా నే చూడొచ్చు. ఇలా ఆ వెబ్ సైట్ పాపులారిటీ సాధిస్తే ఈ కామర్స్ సంస్థలు వాటికి యాడ్స్ ను ప్రమో చేస్తున్నాయి. పైరసీ సైట్లకే కాకుండా ఫోర్న్ సైట్లకు ఇవి ఆదాయాన్నిస్తున్నాయి. పైరేటెడ్ యాప్ లకు 24 శాతం మేర ఆదాయాన్ని ఇస్తున్నాయంటే నమ్మశక్యం కలుగదు. వీటిలో ప్రధానంగా గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ వంటివి కూడా ఉన్నాయి.

అయితే ఇలాంటి పైరసీ వెబ్ సైట్లకు యాడ్స్ ప్రమోట్ చేయడం వల్ల మరిన్నీ పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. దీంతో సినీపరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. తద్వారా రాను రాను నిర్మాతలు నష్టాల్లో కూరుకుపోయి సినిమాలు తీసే అవకాశం ఉండదని అంటున్నారు. పైరసీ సైట్లలో ప్రేక్షకులు సినిమాలు చూడడం వల్ల థియేటర్ జోష్ ను పొందలేరు. మరోవైపో ఈ కామర్స్ సంస్థలు ఇలాంటి సంస్థలకు యాడ్స్ నుప్రమోట్ చేయకుండా నియంత్రిస్తే మేలు జరుగుతుందని భావిస్తున్నారు.