Begin typing your search above and press return to search.

ఖ‌డ్గం హీరోయిన్ తో క్రీడాకారుడి డేటింగ్ ఫుల్ స్వింగ్ లో!

By:  Tupaki Desk   |   6 Sep 2021 10:37 AM GMT
ఖ‌డ్గం హీరోయిన్ తో క్రీడాకారుడి డేటింగ్ ఫుల్ స్వింగ్ లో!
X
ఇద్ద‌రు మాజీలు ప్రేమైకంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. మాజీ టెన్నీస్ క్రీడాకారుడు లియాండ‌ర్ ఫేస్ తో బాలీవుడ్ న‌టి కిమ్ శ‌ర్మ డేటింగ్ లో ఉన్నారంటూ కొన్ని నెల‌లుగా మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. అయితే ఆ ఇద్ద‌రు ఒకే చోట కెమెరా కంటికి చిక్కిన సంద‌ర్భాలు.. సాక్ష్యాలు మీడియాకు దొర‌క‌లేదు. దీంతో వీళ్లిద్ద‌రి రిలేష‌న్ పై ఇన్నాళ్లు సందేహాలుండేవి. ఇటీవ‌లే ఆ ఇద్ద‌రూ క‌లిసి రొమాంటిక్ గా స్పెండ్ చేస్తున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

తాజాగా లియాండ‌ర్ తో త‌న రిలేష‌న్ గురించి కిమ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. అవును ఇద్ద‌రం క‌లిసి జీవిస్తున్నాం అంటూ బ‌హిరంగంగా వెల్లడించింది. ఇన్ స్టా గ్రామ్ స్టాట‌స్ లో ఆ ఇద్ద‌రు క‌లిసి అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది. లియాండ‌ర్ కౌగిలిలో కిమ్ ఒదిగిపోయి క‌నిపిస్తున్న‌ ఫోటోనే ప్రూఫ్‌. కిమ్ కెమెరా వైపు చూస్తుండ‌గా..లియాండ‌ర్ ఆమెను ప్రేమ‌తో చూస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఈ ఫోటోకి 41 ఏళ్ల కిమ్ లియాండ‌ర్ ని ఉద్దేశిస్తూ `హార్ట్ బాయ్` అంటూ ఓ ఎమోజీని పోస్ట్ చేసింది. దీంతో ఇద్ద‌రు డేటింగ్ లో ఉన్న‌ట్లు ఖ‌రారైంది. మ‌రి ఈ వ్య‌వ‌హారం పెళ్లి వ‌ర‌కూ దారి తీస్తుందో.. మ‌జిలీని మ‌ధ్య‌లోనే ముగిస్తారా? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి. కిమ్ కి ప్రేమాయ‌ణాలు కొత్తేం కాదు. గ‌తంలో ఏడుగురితో ప్రేమాయ‌ణాలు సాగించింది. ఇక లియాండ‌ర్ పేస్ మోడ‌ల్ రియాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలువ‌లేదు. మ‌న‌స్ప‌ర్ధ‌లు కార‌ణంగా విడిపోయారు. ఆ త‌ర్వాత లియాండ‌ర్ కిమ్ సాంత్వ‌న‌లో మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చారు. కిమ్ తో లియాండ‌ర్ ల‌వ్ స్టోరీ ఇప్పుడు ఇంటాబ‌య‌టా హాట్ టాపిక్ గా మారింది.

ఎఫైర్ల‌లో కిమ్ రికార్డులే రికార్డులు

బాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ శ‌ర్మ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుపరిచితురాలే. `ఖ‌డ్గం`.. `మ‌గ‌ధీర` చిత్రాల్లో న‌టించి అమ్మ‌డు బాగా ఆక‌ట్టుకుంది. ఆ రెండు చిత్రాలు కిమ్ శ‌ర్మ‌కు మంచి పేరు కూడా తెచ్చిపెట్టాయి. వీట‌న్నింటికి మించి మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ గాళ్ ప్రెండ్ గా దేశం మొత్తం పాపుల‌ర్ అయింది. ఆ పాపులారిటీ కూడా కిమ్ శ‌ర్మ‌కు బాలీవుడ్ లో మంచి అవ‌కాశాలు కూడా తెచ్చిపెట్టాయి. ఇప్ప‌టివ‌ర‌కూ కిమ్ శ‌ర్మ గురించి తెలుగు ఆడియ‌న్స్ కు బాగా తెలిసిన విష‌యాలివే. అయితే కిమ్ శ‌ర్మ ఆన్ స్క్రీన్ లోనే కాదు..ఆఫ్ ద స్క్రీన్ లోనూ ఎంతో రొమాంటిక్ అని ఆమె ఎఫైర్ల గురించి ఒక్కొక్క‌టిగా లీక‌వుతుంటే ఆశ్చ‌ర్య‌పోకుండా ఉండ‌లేరు.

కిమ్ శ‌ర్మ జీవితంలో యువ‌రాజ్ ఒక్క‌డే కాదు..చాలా మంది బోయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కిమ్ శ‌ర్మ లైఫ్ లో మొత్తం 7 గురు కీల‌క వ్య‌క్తులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ఉన్న స‌మ‌యంలోనే యువ‌రాజ్ తో పీక‌ల్లోతూ ప్రేమ‌లో తేలింది. ఇరువురు పెళ్లి చేసుకుంటున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగింది. కానీ ఆ వ్య‌వ‌హారం పీఠ‌ల వ‌ర‌కూ వెళ్ల‌లేదు. అటుపై స్పానిష్ సింగ‌ర్ కార్లోస్ మారిస్ తో కొన్నాళ్ల పాటు డేటింగ్ లో ఉంది. ఇరువురు పెళ్లి ప్ర‌య‌త్నాలు చేసినా అవి స‌ఫ‌లం కాలేదుట‌. అత‌నితో బ్రేక‌ప్ త‌ర్వాత కెన్యా బిజినెస్ మ్యాన్ అలీ పుంజానీతో స‌హ‌జీవ‌నం చేసింది.

ఇద్ద‌రు పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు కాపురం కెన్యాలోనే . అయితే ఆ బంధం కూడా ఎంతో కాలం నిల‌వ‌లేదు. 2017 లో విడిపోయారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి బాలీవుడ్ న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేతో డేటింగ్ చేసిందిట‌. కొన్ని నెల‌ల డేటింగ్ అనంత‌రం యాధావిధిగా బ్రేక‌ప్ జ‌రిగింది. అలాగే బాలీవుడ్ డిజైన‌ర్ అర్జున్ ఖ‌న్నాతో కూడా కొన్నాళ్ల పాటు ఎఫైర్ న‌డిపింది. కొన్నాళ్లు క‌లిసి ఉన్నారు. కానీ ఆ బంధం కూడా వీగిపోయింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ యువ న‌టుడు అమిత్ స‌ద్ తో ప్రేమాయ‌ణం న‌డిపింది. అది కొంత కాల‌మే.

ప్ర‌స్తుతం కిమ్ ఆరుగురి బోయ్ ప్రెండ్స్ ని విడిచిపెట్టి లియాండ‌ర్ పేస్ తో డీప్ ల‌వ్ లో ఉంది. ఇరువురు బీచ్ అందాల న‌డుమ విహ‌రిస్తోన్న ఫోటోలు..స‌న్నిహితంగా మెలిగిన ఫోటోలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇక కిమ్ శ‌ర్మ త‌న డేటింగ్ వ్య‌వ‌హారాల్ని ఏనాడూ దాచింది లేదు. లైఫ్ ప్ర‌తి మ‌లుపులో ర‌సాస్వాధ‌న‌ను ఇష్ట‌ప‌డే న‌టిగా నిరూపించింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.