Begin typing your search above and press return to search.

కిమ్ శ‌ర్మ డేటింగ్.. ఈసారి టెన్నిస్ ఆట‌గాడు లియాండ‌ర్ ఫేస్ తో!

By:  Tupaki Desk   |   15 July 2021 2:30 AM GMT
కిమ్ శ‌ర్మ డేటింగ్.. ఈసారి టెన్నిస్ ఆట‌గాడు లియాండ‌ర్ ఫేస్ తో!
X
దిగ్గ‌జ‌ టెన్నిస్ ఆట‌గాడు లియాండ‌ర్ ఫేస్ .. క‌థానాయిక కిమ్ శ‌ర్మ‌తో డేటింగ్ లో ఉన్నారా? అంటే అవున‌నే క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఆ ఇద్ద‌రూ గోవా పరిస‌రాల్లో జంట‌గా షికార్లు చేస్తున్న ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేయ‌డంతో ప్ర‌స్తుతం ఇది సంచ‌ల‌నంగా మారింది.

కిమ్ శర్మకు డేటింగులు కొత్తేమీ కాదు. సినిమాలతో కంటే ఈ బ్యూటీ వ‌రుస డేటింగుల‌తోనే ఇండ‌స్ట్రీలో పాపుల‌రైంది. కెరీర్ ఆరంభ‌మే క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమాయ‌ణం సాగించిన ఈ బ్యూటీ ప‌లువురు స్టార్ల‌తో ఎఫైర్లు సాగించ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇక కిమ్ శ‌ర్మ మ్యారీడ్ లైఫ్ ఒక టాప్ సీక్రెట్. కెన్యాకి చెందిన బిజినెస్ మేన్ కం డాన్ అలీ పుంజానీని కిమ్ శ‌ర్మ ఓ ప్ర‌యివేట్ కార్య‌క్ర‌మంలో ఘ‌నంగా పెళ్లాడార‌ని కానీ ఆ త‌ర్వాత ఈ జంట న‌డుమ పొర‌పొచ్చాలు వ‌చ్చి విడిపోయార‌ని ప్ర‌చార‌మైంది. కెన్యా విహారానికి వెళ్లిన కిమ్ అలీ పుంజానీతో ప్రేమ‌లో ప‌డింది. కొద్దిరోజుల‌కే అత‌డిని పెళ్లాడింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇక పుంజానీ నుంచి విడిపోయాక కిమ్ తిరిగి బాలీవుడ్ లో ప్ర‌వేశించింది. ఇక్క‌డ యువ‌హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేతో ప్రేమ‌లో ప‌డింది. కిమ్ అంత‌కుముందు శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ హీరోగా కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన `ఖ‌డ్గం`లో ఒక నాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే భూమిక నిర్మించిన‌ త‌కిట త‌కిట అనే చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించాడు. కిమ్ - రాణే ఓ బాలీవుడ్ చిత్రంలో న‌టించేప్పుడు ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌ర్వాత కొంత‌కాలానికే ఈ జంట విడిపోయింది.

కిమ్ ఇప్పుడు టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో డేటింగ్ చేస్తోంద‌ని గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. ఇంత‌కుముందు ఈ ఇద్ద‌రూ ముంబైలో చాలాసార్లు జంట‌గా క‌నిపించినా ఎవ‌రికీ ఏ సందేహాలు రాలేదు. కానీ వీరిద్దరూ ప్రస్తుతం గోవా వెకేష‌న్ ని ఆస్వాధిస్తూ ప‌ట్టుబ‌డ్డారు. బ‌య‌ట‌కు ఈ వ్యవహారాన్ని వెల్లడించక‌పోయినా వారి సాన్నిహిత్యం ర‌క‌ర‌కాల సందేహాల‌కు తావిచ్చింది.

గోవా రెస్టారెంట్లలో తాము ఉన్న‌ బస నుండి ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో ర‌హ‌స్యం ఓపెనైంది. ఈ ఫోటోలో లియాండర్ పేస్ కిమ్ శర్మను వెనుక నుండి కౌగిలించుకుని క‌నిపించారు. ఆ ఇద్ద‌రి న‌డుమా ఘాడ‌మైన అనుబంధం ఈ ఫోటోగ్రాఫ్ లో క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది స్నేహం మాత్ర‌మేనా లేక ప్రేమా? అన్న‌ది ఆ జంట వెల్ల‌డించాల్సి ఉంది. తాజా ఫోటో గోవా రెస్టారెంట్ పౌసాడా బీచ్ ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది కిమ్. తరువాత మరో ఫోటోని కూడా షేర్ చేశారు. ఇందులో క‌లిసి జంట‌గా ఫుడ్ తీసుకోవ‌డం క‌నిపించింది. ఈ ఫోటోల‌కు కిమ్ `మిస్టర్ పి` అని క్యాప్షన్ పెట్టారు. పౌసాడాకు ధన్యవాదాలు.. పి అంటే ఏమిటో క‌నిపెట్ట‌డం ఇక మీ ప‌ని!!