Begin typing your search above and press return to search.

'మిడ్నైట్ మీటింగ్స్'తో బయటపడ్డారు.. త్వరలోనే ప్రేమను ప్రకటిస్తారట!

By:  Tupaki Desk   |   6 Jun 2021 8:00 AM IST
మిడ్నైట్ మీటింగ్స్తో బయటపడ్డారు.. త్వరలోనే ప్రేమను ప్రకటిస్తారట!
X
సినీ ఇండస్ట్రీలో హీరో - హీరోయిన్స్ మధ్య అఫైర్స్ అనేవి ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎందుకంటే తమ అభిమాన హీరో - హీరోయిన్ ఎవరితో డేటింగ్ చేస్తున్నారో.. ఏ హీరోతో లవ్ లో ఉన్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కత్రినా కైఫ్. ఆ మద్యే కత్రినా ఇంటికి ఓ యంగ్ హీరో అర్థరాత్రి వేళలో వచ్చి వెళ్లాడని టాక్ నడిచింది. అప్పటినుండి ఈ హాట్ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం కత్రినా ఆ హీరోకు సంబంధించిన విషయం అటు సోషల్ మీడియాలో ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చర్చలకు దారితీస్తుంది.

మొత్తానికి ఆ మధ్య నైట్ మీటింగ్ ద్వారా ఈ విషయం బయటికి రావడంతో కత్రినాకు ఆ హీరోకి మధ్య ఏదో బలమైన విషయం దాగి ఉందని అనుమానాలు రేకెత్తుతున్నాయి. వారిద్దరూ కూడా ఎలాగో విషయం బయటపడింది కదా అని బాహటంగానే డేటింగ్ చేస్తున్నారు. అయితే ఆ యువహీరో ఎవరో కాదు.. ఉరి ఫేమ్ విక్కీకౌశల్. వీరిద్దరి మధ్య సంథింగ్ ఉందని కొన్ని నెలల నుండి వార్తలొస్తున్నాయి. అయితే ఈరోజుల్లో మేల్ ఫిమేల్ సెలబ్రిటీలు రహస్యంగా కలిస్తే లింకులు కలపడం సహజమే. అలాగని ఇద్దరి మధ్య అఫైర్ లేదంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే రోజులు అలాంటివి. ఇక కత్రినా - విక్కీల విషయం పెళ్లి వరకు ప్రచారం జరుగుతుంది. అలాంటప్పుడు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏమి లేదంటే కాస్తయినా నిజం ఉండే ఉంటుందని వార్తలొచ్చాయి.

అయితే వారి పై పుకార్లను వార్తలను విక్కీకౌశల్ ఆ మధ్యలోనే ఖండించాడు. కానీ ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోలు.. సన్నిహితంగా ఉన్నవి నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇద్దరు కూడా ప్రేమ విషయం దాస్తున్నారని టాక్. ఇంతలో మరి ఇద్దరి మధ్య ఏమి లేనప్పుడు పగలు కలుసుకోవచ్చు కదా.. ఇలా సీక్రెట్ గా మిడ్నైట్ మీటింగ్స్ - సీక్రెట్ డేటింగ్ ఏంటని..? మీడియాలో ప్రశ్నలు గుప్పుమంటున్నాయి. మరి ఈ రీసన్ సరిపోదా.. అంటూ నెటిజన్లు భావిస్తున్నారు. కానీ ఇదివరకే విక్కీ స్పందించి.. 'ఫేమ్ వచ్చిన తర్వాత జీవితం పబ్లిక్ చేతుల్లోకి వెళ్లడం మాములే. కానీ పర్సనల్ లైఫ్ గురించి.. ప్రేమించిన వారి గురించి బహిరంగంగా మాట్లాడటం సరైనది కాదు' అంటూ చెప్పాడు. కానీ తాజా సమాచారం ప్రకారం.. త్వరలోనే ఈ కపుల్ తమ ప్రేమ విషయాన్నీ బహిరంగంగా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు టాక్. మరి చూడాలి ఈసారైనా కత్రినా ఈ కుర్రహీరోతో రిలేషన్ సక్సెస్ చేసుకుంటుందేమో!