Begin typing your search above and press return to search.

కుర్రహీరోల విషయంలో హీరోయిన్స్ అన్యాయం చేస్తున్నారా..??

By:  Tupaki Desk   |   21 Jun 2021 9:00 PM IST
కుర్రహీరోల విషయంలో హీరోయిన్స్ అన్యాయం చేస్తున్నారా..??
X
ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడు వారి తెలివిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు. అందులో ఒకటి ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం. ఇందులో ప్రత్యేకత ఏముందని అనిపిస్తుంది కానీ హీరోయిన్స్ ఇలాంటి విషయాల్లోనే చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తుంటారు. ఎలాగంటే ఇదివరకు ఫలానా సినిమా చేస్తే మన కెరీర్ కు ప్లస్ అవుతుందా లేదా అని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. పూర్తిగా పంథా మారిపోయింది. అందుకే ఈ తరం హీరోయిన్స్ సినిమా గురించి కాకుండా హీరోస్ విషయంలో కూడా సెలక్షన్ జాగ్రత్తగా చేసుకుంటున్నారు.

అంటే ఏ హీరోతో అయినా సినిమా చేసేద్దాం అనుకునే హీరోయిన్స్ ఉంటారు. మరికొందరు ఏదైతే ఏంటి అవకాశం వచ్చింది కదా అని అనుకుంటారు. కానీ ఈ తరం ముద్దుగుమ్మలు మాత్రం ఫలానా హీరోతో సినిమా చేస్తే మనకు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనే ఆలోచనలో సినిమాలు కూడా వదులుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోయిన్స్ అంటే ఓకే తెలిసిన హీరోలే కదా.. వారి మార్కెట్ కూడా తెలుసు కాబట్టి ప్రొసీడ్ అయిపోతుంటారు. కానీ అప్ కమింగ్ హీరోలు.. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న హీరోలతో సినిమాలు చేస్తే మాత్రం ఎలాంటి లాభం లేదని భావిస్తున్నట్లు కాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి.

అందుకే ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకుంటున్న వారు.. అందులోను ముఖ్యంగా పరభాషా హీరోయిన్స్ అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీగా లేరట. ముంబై నుండి వచ్చే హీరోయిన్స్ అయితే ఖచ్చితంగా స్టార్ హీరోల సినిమాలు వస్తేనే డెబ్యూ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే స్టార్ హీరో సరసన నటిస్తే కనీసం ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతామని.. అలాగే ఎప్పుడు వచ్చినా మన ముఖం గుర్తు పడతారని అంటున్నారట హీరోయిన్స్. మరి ఈ లెక్కన అందరికి స్టార్ హీరోలు.. భారీ సినిమాలే కావాలంటే మా పరిస్థితి ఏంటి? అంటున్నారట కుర్రహీరోలు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.