Begin typing your search above and press return to search.

'ప్రభాస్ - దీపికా' కాంబో పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారా..??

By:  Tupaki Desk   |   30 May 2021 6:00 AM IST
ప్రభాస్ - దీపికా కాంబో పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారా..??
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇటీవలే జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' మూవీ పూర్తిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ మూవీ పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. సలార్ - ఆదిపురుష్ సినిమాలు లైన్ లో పెట్టేసాడు. అయితే వీటి తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు ప్రభాస్. ఈ ఏడాది చివరలో సినిమా షూటింగ్ ప్రారంభిచాలని ప్లానింగులో ఉన్న ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడట. సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి గ్రాఫికల్ విసువల్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయట.

అయితే ఈ సినిమాను ఇంటర్నేషనల్ టెక్నికల్ వేల్యూస్ తో వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. పాన్ వరల్డ్ లెవల్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి రోజు ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి చర్చ జరుగుతుంది. ప్రభాస్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి దీపిక సౌత్ ఇండియన్ స్టార్ తో నటించడానికి ఓకే చెప్పిందని అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ మధ్య సౌత్ ఇండియన్ మూవీస్ మాత్రమే దేశవ్యాప్తంగా క్రేజ్ సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్స్ నటించిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయని డార్లింగ్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారట.

అందులో భాగంగానే కంగనాతో ఏక్ నిరంజన్, శ్రద్ధాకపూర్ తో సాహో సినిమాలు నిరాశపరిచయాని టాక్. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ దీపిక పదుకోనె హీరోయిన్ అనేసరికి కాస్త టెన్షన్ పడుతున్నారు. మరి ప్రస్తుతం నటిస్తున్న పూజాహెగ్డే - కృతిసనన్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినవారే కదా అంటూ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కానీ పూజాహెగ్డే - కృతిసనన్ లాంటి వారంతా ఆల్రెడీ తెలుగులో కెరీర్ ప్రారంభించినవారే అంటూ బదులు చెబుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే ఇప్పటివరకు ప్రభాస్ తో బాలీవుడ్ హీరోయిన్స్ డెబ్యూ చేసిన సినిమాలు మాత్రమే ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. పూజాహెగ్డే - కృతిసనన్ ప్రభాస్ తో డెబ్యూ కాదు. త్వరలో దీపికా పదుకొనే టాలీవుడ్ డెబ్యూ చేయబోతుంది. మరి చూడాలి ఈసారి డార్లింగ్ కు అమ్మడు ఈ సెంటిమెంట్ తుడిచేస్తుందేమో..!