Begin typing your search above and press return to search.

క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌కు కాలం చెల్లిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   31 Aug 2022 12:30 AM GMT
క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌కు కాలం చెల్లిన‌ట్టేనా?
X
ఒక ద‌శ‌లో క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మర‌థం ప‌ట్టారు. ఆ కార‌ణంగానే టాలీవుడ్ లో చాలా మంది స్టార్ లు పుట్టుకొచ్చారు. కానీ ఇటీవ‌ల ట్రెండ్ మారింది. దీంతో క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌కు కాలం చెల్లిన‌ట్టేనా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఇటీవ‌ల క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో రూపొందిన సినిమాలేవీ పెద్ద‌గా బాక్సాఫీస్ వ‌ద్ద ఆడ‌క‌పోవ‌డ‌మే కాకుండా డిజాస్ట‌ర్లుగా మార‌డమే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన స్టార్ హీరోల సినిమాలు ఏవీ ఆక‌ట్టుకోలేక నిరుత్సాహ ప‌రిచాయి.

జూన్, జూలై నెల్లో విడుద‌లైన భారీ సినిమాలు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి. నాని న‌టించిన `అంటే సుంద‌రానికి`, రానా, సాయి ప‌ల్ల‌వి న‌టించిన `విరాట‌పర్వం`, జూలైలో గోపీచంద్ హీరోగా విడుద‌లైన `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`, రామ్ న‌టించిన `ది వారియ‌ర్‌`, నాగ‌చైత‌న్య న‌టించిన `థాంక్యూ`, మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `రామారావు ఆన్ డ్యూటీ`, నితిన్ హీరోగా న‌టించ‌గా ఆగ‌స్టు 12న విడుద‌లైన `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం`, ఆగ‌స్టు 25న విడుద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా మూవీ `లైగ‌ర్‌` ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ పంథాలో రూపొందిన‌వే.

ఈ సినిమాల‌పై ముందు భారీ అంచ‌నాలు నెల‌కొన్నా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే స‌రికి ఏ సినిమా కూడా స‌గ‌టు ప్రేక్ష‌కుడిని ఏ విష‌యంలోనూ సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోయింది. మూస ధోర‌ణి క‌థ‌లు, అదే క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ టేకింగ్ కార‌ణంగా ఈ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని పెద్ద‌గా ఎట్రాక్ట్ చేయ‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. గోనీచంద్ న‌టించిన `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` విష‌యంలో చాలా హోప్స్ పెట్టుకున్నారు. అది కూడా రోటీన్ క‌మ‌ర్షియ‌ల్ క‌థే కావ‌డంతో ప్రేక్ష‌కులు వెంట‌నే రిజెక్ట్ చేశారు.

ఇక రామ్ న‌టించిన `ది వారియ‌ర్‌`, ర‌వితేజ `రామారావు ఆన్ డ్యూటీ`, నితిన్ `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం`, విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌` సినిమాలు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్ముల‌తో మాస్ ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకోవాల‌నే పంథాలోనే తెర‌కెక్కాయి. కానీ ఏ సినిమాలోనూ కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో భారీ డిజాస్ట‌ర్ లుగా నిలిచాయి. అయితే ఇదే స‌మ‌యంలో విడుద‌లైన క‌ల్యాణ్ రామ్ `బింబిసార‌`, దుల్క‌ర్ స‌ల్మాన్ `సీతారామం`, ఆగ‌స్టు 13న విడుద‌లైన నిఖిల్ `కార్తికేయ 2` కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో రూపొంది భారీ విజ‌యాల‌ని సాధించాయి.

ఈ సినిమాల అనూహ్య విజ‌యాల‌తో ప్రేక్ష‌కుడు క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా సినిమాల కంటే కంటెంట్ ప్ర‌ధానంగా సాగుతూ ప్ర‌త్యేకంగా వుండే సినిమాల‌రే ప్ర‌ధాన్య‌త‌న నిస్తున్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. క‌మ‌ర్షియ‌ల్ అంటూ నేల‌విడిచి సాము చేయ‌కుండా స‌గ‌టు ప్రేక్ష‌కుడి నాడికి త‌గ్గ‌ట్టుగా సినిమాలు చేయాల‌ని మేక‌ర్స్ ఆలోచ‌నలో ప‌డ్డారు. ఈ సినిమాల ఫ‌లితాల‌తో తేరుకున్న కొంత మంది మేక‌ర్స్ నిర్మాణంలో వున్న సినిమాలని రీ షూట్ లు చేసుకుంటున్నార‌ట‌. మారిన ప్రేక్ష‌కుడి అభిరుచికి అనుగుణంగా క‌థ‌ల్లో మార్పులు చేసుకుంటున్నార‌ట‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.