Begin typing your search above and press return to search.
ఆ సినిమాలు అన్నీ ఓటీటీ కోసమేనా...?
By: Tupaki Desk | 16 July 2020 12:40 PM ISTసినీ ఇండస్ట్రీ గత నాలుగు నెలలుగా క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా విడుదలలు లేకపోవడంతో నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను చవి చూస్తున్నారు. అయినా సరే టాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం మాత్రం ఆగలేదు. ఈ కరోనా డేస్ లో చాలామంది ప్రొడ్యూసర్స్ చిన్నా చితక మూవీస్ చాలానే ప్రకటించేసారు. అయితే వీరంతా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఉన్నాయనే ధైర్యంతోనే సినిమాలు తీస్తున్నారనే కామెంట్స్ ఫిలింనగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ఇప్పుడల్లా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రిలీజ్ కి రెడీ అయిన క్రేజీ మూవీస్ అన్ని థియేటర్స్ రీ ఓపెన్ ఎప్పుడవుతాయా అని వెయిట్ చేస్తున్నారు. కానీ చిన్న సినిమాలు.. అంతగా క్రేజ్ లేని మూవీస్ మాత్రం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలలో రిలీజ్ చేసుకుంటున్నారు. పెద్ద మూవీస్ ఓటీటీలో వర్కౌట్ అవుతాయో లేదో అనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో చిన్న సినిమాలు మాత్రం ఓటీటీలను నమ్ముకొని లాభాలు పొందుతున్నాయని టాక్.
అందుకోసమే ఫ్యూచర్ లో చిన్న సినిమాలకి థియేటర్స్ దొరకకపోయినా ఓటీటీలు ఉన్నాయనే ధైర్యంతో కొంతమంది ప్రొడ్యూసర్స్ న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. దీని కోసం ఒకటి రెండు సినిమాలు తీసిన హీరోలను.. టాలెంట్ ఉండి కూడా అవకాశాలు లేని హీరోయిన్స్ ని పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా ఓ కుర్ర హీరో రెండు సినిమాలు ప్రకటించేసారు. ఇంతముందు సినిమాతో కాస్తో కూస్తో ఇండస్ట్రీలో కొంతమంది పరిచయం అవ్వడంతో ఇప్పుడు ఆ కుర్ర హీరోపై పెట్టుబడలు పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ముందుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ ఉన్న సిచ్యుయేషన్ లో ఇలా వరుసగా రెండు సినిమాలు ప్రకటించడంతో ఆ హీరోనే ఈ ఈ సినిమాలకి ఫైనాన్సియల్ బ్యాకింగ్ కూడా చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.
కాకపోతే ఈ సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేయడానికైనా పనికొస్తాయని.. ఈ సినిమాల వలన నష్టపోయేదేమీ లేదనే ఆలోచనతో మేకర్స్ చిన్న హీరోలతో సినిమాలు కమిట్ అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. నిజానికి ఇలాంటి టైంలో పెద్ద సినిమాలు నిర్మించడం రిస్క్ అని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. అందుకే చిన్న సినిమాలైతేనే బెటర్ అని.. థియేటర్స్ ఓపెన్ కాకపోయినా ఓటీటీ రిలీజ్ చేసుకోవచ్చు.. అదే భారీ బడ్జెట్ సినిమాలైతే అటు ఓటీటీ రిలీజ్ చేయలేక ఇటు థియేటర్స్ కి జనాలు ఒకప్పటిలా వస్తారో రారో అనే ఆలోచన చేయాల్సి ఉంటుంది. అందుకే కొంతమంది ప్రొడ్యూసర్స్ చిన్న సినిమాలు నిర్మించే ఆలోచన చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.