Begin typing your search above and press return to search.
మెగా హీరోలందరూ సెలవులు తీసుకుంటున్నారా..?
By: Tupaki Desk | 2 Dec 2020 10:00 PM ISTకొణిదెల వారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల వివాహం గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో జరగనుంది. ఇప్పటికే నిహారిక - చైతన్యల నిశ్చితార్థం గ్రాండ్ గా జరుపగా.. డిసెంబర్ 9న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ గా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కోటలో నిహారిక వివాహం చేయడానికి మెగా ఫ్యామిలీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. దీనికి మెగా హీరోలతో పాటు ఇండస్ట్రీ నుంచి ప్రముఖులందరూ హాజరయ్యే అవకాశం ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి - రామ్ చరణ్ - వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ - పంజా వైష్ణవ్ తేజ్ - కళ్యాణ్ దేవ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ తదితరులు ఇందులో పాల్గొననున్నారు. నిశ్చితార్థానికి హాజరుకాని పవన్ కళ్యాణ్ కూడా ఈ వివాహానికి అటెండ్ అవుతాడని తెలుస్తోంది.
నిహారిక - చైతన్యల వెడ్డింగ్ కోసం మెగా హీరోలందరూ డిసెంబర్ 7 నుంచి 11 వరకు షూటింగులను పక్కనపెట్టి సెలవులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మెగా - అల్లు హీరోలతో పాటు మెగా కాంపౌండ్ లోని దర్శకులు నిర్మాతలు కూడా ఈ వివాహానికి హాజరవడం కోసం సినిమాలకు విరామం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా దాదాపుగా సినీ ప్రముఖులందరూ ఒకేసారి షూటింగ్ కి విరామం ఇచ్చే అవకాశం ఉండటంతో ఇండస్ట్రీ మొత్తానికి ఆ ఐదు రోజులు సెలవులు మాదిరిగా అవుతుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినినిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా నిహారిక పెళ్ళికి సంబంధించిన శుభలేఖను మెగా ఫ్యామిలీ విడుదల చేసింది. డిసెంబర్ 9(బుధవారం) వివాహం జరగనుండగా.. డిసెంబర్ 11న హైదరాబాద్ లోని జెఆర్‌సీ కన్వెన్షన్ లో రిసప్షన్ జరగనుంది.