Begin typing your search above and press return to search.

ఐపీఎల్ యాంకర్.. రచ్చో రచ్చస్య

By:  Tupaki Desk   |   31 July 2018 3:40 PM IST
ఐపీఎల్ యాంకర్.. రచ్చో రచ్చస్య
X
యాంకర్లు.. స్పోర్ట్స్ ప్రెజెంటర్లు ఒకప్పుడు చాలా పద్ధతిగా.. సంప్రదాయబద్ధంగా కనిపించేవాళ్లు. కానీ వాళ్లలోనూ గ్లామర్ కోణం చూపించి యువతను ఆకర్షించడం తర్వాత ట్రెండుగా మారింది. ‘జబర్దస్త్’ ప్రోగ్రాం ద్వారా అనసూయ.. రష్మి లాంటి వాళ్లు యాంకరింగ్ స్టైలే మార్చేశారు. చాలా గ్లామరస్ గా కనిపిస్తూ కుర్రకారును టీవీల వైపు ఆకర్షించారు. ఇక స్పోర్ట్స్ ప్రెజెంటర్ల విషయానికి వస్తే.. అర్చనా విజయ.. మయంతి లాంగర్.. షిబాని దండేకర్ ఎంత హాట్ హాట్‌ గా కనిపిస్తారో తెలిసిందే. ముఖ్యంగా అర్చనా విజయ గ్లామర్ ఒలకబోయడంలో మిగతా వాళ్ల కంటే రెండాకులు ఎక్కువే చదివింది. ఒకప్పుడు ఐపీఎల్లో యాంకర్‌ గా కొనసాగుతూనే ఆమె చేసిన హాట్ హాట్ ఫొటోషూట్లు సంచలనం రేపాయి.

ఐపీఎల్‌ కు దూరమయ్యాక ఆమె లైమ్ లైట్లో లేకుండా పోయింది కానీ.. అప్పుడుప్పుడూ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన బికినీ ఫొటో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఇది ఫొటో షూట్లో భాగంగా తీసినట్లు లేదు. ఒక స్విమ్మింగ్ పూల్‌ సేద దీరుతూ.. మధ్యలో అర్చననే బికినీ సెల్ఫీ తీసుకుంది. టూ పీస్ బికినీలో అందాలు ఆరబోస్తూ సెగలు రేపుతోంది అర్చన. ఈమె హాట్ నెస్ ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే అనిపిస్తోంది.