Begin typing your search above and press return to search.

సెక్స్ లేకుండా సల్మాన్ ఉండలేదు

By:  Tupaki Desk   |   13 Dec 2016 7:30 AM GMT
సెక్స్ లేకుండా సల్మాన్ ఉండలేదు
X
50 ఏళ్లకు దగ్గర పడుతున్నా ఇప్పటికీ బ్యాచిలర్‌ గానే ఉన్నాడు సల్మాన్ ఖాన్. పెళ్లయితే చేసుకోలేదు కానీ.. ఇప్పటిదాకా చాలా ఎఫైర్లే నడిపాడు కండల వీరుడు. ఆ ఎఫైర్లలో రొమాంటిక్ కోణం లేదు అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం తాను ఇంకా వర్జిన్ అంటూ భలే కామెడీలు చేస్తుంటాడు. అడిగినా అడక్కపోయినా ఈ మాట చెబుతుంటాడు. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాంలో కూడా సల్మాన్ ఇదే మాట చెప్పాడు. తాను వర్జిన్ అని బల్లగుద్ది చెప్పేశాడు. కానీ సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మాత్రం అన్నయ్య గాలి తీసేస్తూ దీనికి భిన్నంగా మాట్లాడటం విశేషం.

తన అన్నయ్య సెక్స్ లేకుండా ఉండలేడన్నట్లు మాట్లాడాడు అర్బాజ్. ‘నో సెక్స్ ఫర్ ఎ మంత్’ అనే ఛాలెంజ్ ను తన అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోలేడని అర్బాజ్ తేల్చి చెప్పేశాడు. తన అన్నయ్య సెక్స్ లేకుండా ఉండలేడన్న విషయంలో తనకు ఎలాంటి సందేహాలు లేవని అర్బాజ్ చెప్పాడు. అర్బాజ్ ఈ మాట చెప్పాక కూడా సల్మాన్ తాను వర్జినే అని బల్లగుద్ది చెప్పడం విశేషం. ఇక తన రిలేషన్ షిప్స్ చాలా వరకు విఫలమవడంపై సల్మాన్ స్పందిస్తూ.. ఈ విషయంలో తాను అంత మంచి వాడిని కానేమో అన్నాడు. ఈ ప్రోగ్రాం ఆరంభంలో తన ప్రేమాయణాల గురించి మాత్రం ప్రశ్నలు అడగకూడదంటూ సల్మాన్ షరతులు విధించినా.. కరణ్ అతడి మాటను మన్నించకుండా పరోక్షంగా దాని మీద ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రోగ్రాం మధ్యలో కత్రినా పాట.. మై నేమ్ ఈజ్ షీలా పాటకు సల్మాన్ స్టెప్పులేయడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/