Begin typing your search above and press return to search.

కొత్త బంధంపై ఓపెన్ అయిన ఖాన్ తమ్ముడు!

By:  Tupaki Desk   |   25 Oct 2018 11:45 AM GMT
కొత్త బంధంపై ఓపెన్ అయిన ఖాన్ తమ్ముడు!
X
సల్మాన్ ఖాన్ తమ్ముడిగానే కాకుండా అర్బాజ్ ఖాన్ ఒక నటుడిగా నిర్మాతగా కూడా అందరికీ తెలుసు. అర్బాజ్ ఖాన్ - మలైకా అరోరా దంపతులు తమ 19 ఏళ్ళ వైవాహిక బంధానికి 2017 లో గుడ్ బై చెప్పి విడాకులు తీసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలు కలిసి ఉన్న జంట విడాకులు తీసుకోవడం అప్పట్లో ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇక దానికి కారణాలపై ఎన్నో గాసిప్పులు ప్రచారంలో ఉన్నాయి.

అందులో ఒకటి మలైకా - యువ హీరో అర్జున్ కపూర్ల ప్రేమాయణం. బయటకు ఓపెన్ గా చెప్పకపోయినా ఇద్దరూ ఎన్నో సార్లు కెమెరా కంటికి చిక్కారు. తాజాగా మలైకా అర్జున్ కపూర్ లు విదేశంలో విహార యాత్రకు మలైకా పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకునేందుకు వెళ్ళడం రిపోర్టర్స్ కంటబడింది. కుర్ర హీరో.. ఆంటీల ప్రేమాయణం ఇప్పుడు బాలీవుడ్ లో ఒక పెద్ద హాట్ న్యూస్. త్వరలో ఇద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే అర్బాజ్ ఖాన్ గత కొన్ని నెలలుగా జార్జియా ఆండ్రియాని అనే మోడల్ తో అఫైర్ సాగిస్తున్నట్టుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రీసెంట్ గా సల్మాన్ సోదరి అర్పిత నిర్వహించిన గణేష్ పూజలో అర్బాజ్ - జార్జియా ఆండ్రియాని ఇద్దరూ జంటగా పాల్గొన్నారు. అర్బాజ్ తనయుడు కూడా తోడుగా ఉండడం విశేషం. మరోవైపు అర్బాజ్ ఖాన్ జార్జియా ఆండ్రియాని తో నవరాత్రి వేడుకలను గుజరాత్ లో జరుపుకున్నానని.. గుజరాత్ కు ఎప్పుడు వచ్చినా వారి ఆతిథ్యం చూసి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అని పంచుకుంటూ జార్జియా తో కలిసి ఉన్న ఒక ఫోటో ను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. దీంతో అర్బాజ్ తమ బంధం గురించి ఓపెన్ అయ్యాడని త్వరలో మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.