Begin typing your search above and press return to search.

జంటగా కోర్టుకు వచ్చి విడిగా వెళ్లిపోయారు

By:  Tupaki Desk   |   30 Nov 2016 5:49 AM GMT
జంటగా కోర్టుకు వచ్చి విడిగా వెళ్లిపోయారు
X
బాలీవుడ్ లో ప్రేమలు.. బ్రేకప్ లు చాలా మామూలుగా జరిగిపోతుంటాయి. ప్రేమలో పడినోళ్లకు బ్రేకప్ లు.. బ్రేకప్ అయినోళ్లు కొత్త ప్రేమలో పడిపోతుంటారు. కొంతకాలంగా ఈ ట్రెండ్ నడుస్తోంది. ఈ మధ్యలో విడాకులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అప్పటివరకూబాగానే ఉన్నట్లుగా కనిపించిన బాలీవుడ్ జంటలు విడిగా ఉంటామంటూ కోర్టు గుమ్మం ఎక్కుతున్నారు. ఆ మధ్యన విడాకులు పక్కా అంటూ వార్తలు వచ్చి.. ఆ తర్వాత కుటుంబ సభ్యుల జోక్యంతో ఇష్యూ సమిసిపోయినట్లుగా కనిపించిన బాలీవుడ్ హాట్ మలైకా జంట విడాకుల దిశగా జర్నీ సాగుతోంది.

పదిహేడేళ్లు వివాహబంధంలో బండి నడిపేసిన మలైకాఅరోరా.. అర్బాజ్ ఖాన్ జంట ఇక కలిసి ఉండలేమని తేల్చుకున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఈ జంట ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇరువురు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నట్లుగా దరఖాస్తు చేశారు. కోర్టుకు వచ్చినప్పుడు కలిసి వచ్చిన ఈ జంట.. కోర్టు నుంచి బయటకు వచ్చాక మాత్రం.. ఎవరి దారిన వారు వెళ్లి పోవటం గమనార్హం.

1997లో అర్బాజ్ ఖాన్.. మలైకా అరోరా వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా అన్నాడు. అయితే.. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో మలైకాకు ఎఫైర్ ఉందని.. దీంతో అర్బాత్ తో విభేదాలు ఏర్పడినట్లు చెబుతున్నారు. నిజానికి వీరిద్దరి మధ్యనున్న దూరాన్ని తగ్గించేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయినప్పటికీ.. విడాకుల కోసం తాజాగా కోర్టు గుమ్మం ఎక్కిన నేపథ్యంలో.. ఈ జంట విడాకులు తీసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/