Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ రికార్డ్: 1.5 మిలియన్ మార్క్.. నాలుగోసారి

By:  Tupaki Desk   |   14 Oct 2018 5:09 AM GMT
ఎన్టీఆర్ రికార్డ్: 1.5 మిలియన్ మార్క్.. నాలుగోసారి
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత' ఓవర్సీస్ లో దుమ్ము దులుపుతోంది. బుధవారం నాటి ప్రిమియర్ల తోనే $797366 సాధించిన ఎన్టీఆర్ సినిమా గురువారం నాడు $242424 సాధించి వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. ఇక శుక్రవారం నాడు $276477 కలెక్షన్స్ సాధించింది. శనివారం మధ్యాహ్నానికి $198294 కలెక్షన్స్ తో టోటల్ ఒకటిన్నర మిలియన్ డాలర్లకు చేరింది. కరెక్ట్ గా చెప్పుకుంటే సాటర్ డే అఫ్టర్ నూన్ వరకూ టోటల్ $1514561.

'అరవింద సమేత' $1.5 మిలియన్ డాలర్ల మార్క్ సాధించడంతో యంగ్ టైగర్ ఒక కొత్త రికార్డ్ నెలకొల్పాడు. సౌత్ లో ఎన్టీఆర్ తప్ప మరే ఇతర హీరోకూ వరసగా నాలుగు సినిమాలు 1.5 మిలియన్ మార్క్ టచ్ చేయడం జరగలేదు. ఇప్పటికే 'నాన్నకు ప్రేమతో'.. 'జనతా గ్యారేజ్'.. 'జై లవకుశ' సినిమాలు 1.5 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. తాజాగా 'అరవింద సమేత' కూడా 1.5 మిలియన్ కలెక్షన్స్ సాధించడం తో ఎన్టీఆర్ కు ఈ అరుదైన రికార్డు నెలకొల్పడం సాధ్యమైంది.

తారక్ కెరీర్ లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం 'నాన్నకు ప్రేమతో'( $2022384). ప్రస్తుతం 'అరవింద సమేత' కలెక్షన్స్ జోరు చూస్తుంటే వీకెండ్ పూర్తయ్యే సమయానికి 2 మిలియన్ డాలర్ మార్క్ ను చేరడం.. 'నాన్నకు ప్రేమతో' ఫుల్ రన్ కలెక్షన్స్ దాటడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదిలా ఉంటే తండ్రి మరణంతో ఎన్టీఆర్ 'అరవింద సమేత' సక్సెస్ సెలబ్రేషన్స్ కు దూరంగా ఉన్నాడు. కొన్ని రోజులు ఫారెన్ వెకేషన్ కు వెళ్ళి రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నాడట. ఇండియా కు తిరిగి వచ్చిన తర్వాత #RRR టీమ్ తో జాయిన్ అవుతాడని సమాచారం.