Begin typing your search above and press return to search.

'అరవింద సమేత' మేకింగ్.. ఎన్టీఆర్ కొడుకు 'కత్తి'

By:  Tupaki Desk   |   4 Oct 2018 5:57 AM GMT
అరవింద సమేత మేకింగ్.. ఎన్టీఆర్ కొడుకు కత్తి
X
ఇప్పుడందరి దృష్టి దానిమీదే.. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ చాలా పకడ్బందీగా.. తన అభిరుచికి పూర్తి భిన్నమైన రాయలసీమ ఫ్యాక్షన్ కథను ఎంచుకున్నాడు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో తెరపై రౌద్రం ప్రదర్శించేందుకు రెడీ అయ్యారు. అటు త్రివిక్రమ్ శైలి.. ఎన్టీఆర్ వాడి కలిస్తే ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోతోంది. ఇటీవలే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్బంగా విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

తాజాగా అరవింద సమేత చిత్రానికి మరింత హైప్ తెచ్చేలా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ తనయుడు అభయ్.. తండ్రి పట్టిన కత్తి పట్టి త్రివిక్రమ్ ఒడిలో కూర్చొని ‘స్టార్ట్ కెమెరా’ అంటూ పలకడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా అభయ్ రామ్ సెట్స్ కు వచ్చినట్టు కనిపిస్తోంది. పక్కనే ఫైట్ మాస్టర్ ఉండడాన్ని బట్టి అర్థమవుతోంది.

త్రివిక్రమ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ చేత కత్తి పట్టించి ప్రత్యర్థులను నరికించేశాడు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో.. ఇలా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నటించి చాలా కాలమైంది.‘ఆది’’తర్వాత అంతటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించాడని తెలుస్తోంది.ఈ మేకింగ్ వీడియోలో అభయ్ రామ్ చేత కూడా త్రివిక్రమ్ కత్తి పట్టించాడు. తండ్రిని అనుకరించేలా కొడుకు అభయ్ రామ్ తో కూడా త్రివిక్రమ్ అప్పుడే కత్తి పట్టించి సినిమా పాఠాలు బోధిస్తున్నాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

ఈ మేకింగ్ వీడియోలో త్రివిక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ - హీరోయిన్ పూజా హెగ్డేకు సీన్లు వివరిస్తున్నట్టు చూపించారు. నాగబాబుతో మాట్లాడే సీన్లు కూడా చూపించారు. ఇందులో నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇక చివర్లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సాదాసీదాగా రోడ్డు పక్కన కూర్చొని ముచ్చట్లలో మునిగిపోయారు. త్రివిక్రమ్ ఏ హీరోతో చేసిన వారితో అవినాభావ బంధం ఏర్పరుచుకుంటారు. ఇదివరకూ పవన్ తోనూ.. ఇప్పుడు ఎన్టీఆర్ తోనూ అదే బంధం కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా ప్రి రిలీజ్ లో ఒప్పుకున్నాడు. ఇలా త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అంటే జోష్ - ఫన్ అని సరదాగా సాగిపోతుందని మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతోంది.