Begin typing your search above and press return to search.
'అరవింద సమేత' ఆడియోకు టైం లేదా?
By: Tupaki Desk | 13 Sept 2018 7:00 AM ISTతెలుగులో ఈ ఏడాది ద్వితీయార్ధంలో రావాల్సిన అతి పెద్ద సినిమా ‘అరవింద సమేత’నే. జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ఈ చిత్ర విడుదలకు ఇంకో నెల రోజులు కూడా సమయం లేదు. ముందు అనుకున్న ప్రకారం అయితే వినాయక చవితి నుంచే ఈ చిత్ర ప్రమోషన్లు మొదలుపెట్టాల్సింది. కానీ ఈ చిత్ర షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. మధ్యలో హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్ కొన్ని రోజులు అందుబాటులో లేకపోవడంతో షెడ్యూళ్లు కొంచెం తారుమారు అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకే సినిమాను రిలీజ్ చేయాలన్న పట్టుదలో చిత్ర బృందం కష్టపడుతోంది.
ఈ నేపథ్యంలో ‘అరవింద సమేత’ ఆడియో వేడుకను కూడా రద్దు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పక్కాగా ఏ రోజు షూటింగ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆడియో వేడుకను రద్దు చేయాలని డిసైడైనట్లు వార్తలొస్తున్నాయి. ఆడియో వేడుక జరిగేది ఒక రోజే అయినా దానికి కొన్ని రోజుల ముందు నుంచే సన్నాహాలు చేయాలి. ఇవన్నీ ఎందుకని భావించి.. ఆడియోను నేరుగా ఆన్ లైన్లో వదిలేస్తారట. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి టెన్షన్ తీరిపోయాక విడుదలకు దగ్గర్లో ప్రి రిలీజ్ ఈవెంట్ చేయాలని డిసైడయ్యారట. దీంతో ‘అరవింద సమేత’ ఆడియోకు బాలయ్య వస్తాడని.. బాబాయ్-అబ్బాయి కలిసి నందమూరి అభిమానులకు కనువిందు చేస్తారని జరిగిన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్లే. ఒకవేళ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్యే వస్తే రావచ్చు. కానీ దానిపైనా స్పష్టత లేదు.