Begin typing your search above and press return to search.
అలనాటి హీరో.. సిక్స్ ప్యాకేనా??
By: Tupaki Desk | 7 Sept 2017 4:00 AM ISTఒకప్పుడు హీరో అంటే అరవింద్ స్వామిలాగా ఉండాలి అనేవారు. బాడీ లేకున్నా ఆయన కలర్ కి స్మైల్ కి అమ్మాయిలైతే పిచ్చెక్కిపోయేవారు. అంతే కాకుండా ఆయనను కలిసేందుకు అమ్మాయిలు ఇంటివరకు వచ్చేవారని తరచూ ఇంటర్వ్యూలలో చెబుతుంటారు అరవింద్. ప్రస్తుతం ఈ నటుడు కొన్ని వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే.
యువ హీరోలకు ధీటుగా విలన్ పాత్రలను చేస్తూ సినిమాకి హైప్ ని క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు వచ్చిన చిత్రాలకు బిన్నంగా మళ్లీ అప్పటిలాగా తన హీరోయిజాన్ని చూపించడానికి రెడీ అయిపోతున్నాడట. ప్రముఖ దర్శకుడు సెల్వ తెరకెక్కిస్తున్న ఒక యాక్షన్ థ్రిల్లర్ తరహాలో రాబోతున్న "వనంగముడి" అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడట అరవింద్ స్వామి. ఈ విషయాన్నీ చిత్ర దర్శకుడు సెల్వ ఓ ప్రముఖ వార్త పత్రికకు తెలిపాడు. ఈ సినిమాలో తన పాత్ర కోసం అరవింద్ గారు ఎంతో కష్టపడుతున్నారని, కొన్ని వ్యాయామాలు కూడా చేస్తున్నట్లు చెప్పాడు. అంతే కాకుండా ఒక డైట్ ఫాలొ అవుతూ ఆహార విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడని దర్శకుడు చెప్పాడు.
విషయం ఏంటంటే.. ఈ సినిమాలో అరవింద్ స్వామి సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్నడని, సినిమాలో పర్ఫెక్ట్ బాడీతో సడన్ సప్రైజ్ ఇస్తాడని తెలుస్తోంది. 47ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ అంటే అనుకున్నంత ఈజీ కాదు మరి ఈ ఎవర్ గ్రీన్ హీరో ఎలా దర్శనమిస్తాడో చూద్దాం.