Begin typing your search above and press return to search.

అక్కడ మాత్రం పాడరేందుకు?

By:  Tupaki Desk   |   25 Oct 2017 4:59 AM GMT
అక్కడ మాత్రం పాడరేందుకు?
X
సినిమా థియేటర్లలో ప్రతి షో స్టార్టయ్యే ముందు ముందు జాతీయ గీతం వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని గౌరవిస్తూ లేచి నుల్చోవాల్సిందిగా ముందే స్లైడ్ కూడా వేస్తున్నారు. అయితే అలా నుంచోవడం తప్పనిసరేం కాదని తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే సుప్రీం తీర్పు సంగతి కాసేపు పక్కన పెడితే అసలు సినిమా థియేటర్లలో జాతీయ గీతం వినిపించాలనే నిర్ణయంపై నటుడు అరవిందస్వామికి ఓ బ్రహ్మాండమైన డౌటొచ్చింది.

‘‘గవర్నమెంట్ ఆఫీసులు - కోర్టులు - అసెంబ్లీలు - పార్లమెంటు హాలులో రోజూ జాతీయ గీతం ఎందుకు ఆలపించారు. వినోదం కోసం ఉన్న సినిమా హాళ్లలోనే జాతీయ గీతం వినిపించడం ఎందుకు తప్పనిసరి చేశారు?’’ అంటూ ట్విట్టర్ వేదికగా తన సందేహం వ్యక్తం చేశాడు అరవిందస్వామి. ‘‘జాతీయగీతం ఎప్పుడు వినిపించినా నేను లేచి నుంచుంటాను. నా తోటివారితో కలిసి గొంతు కలిపి జాతీయగీతం ఆలపిస్తా. దానిని గొప్పగౌరవంగా భావిస్తా’’ అంటూ జనగణమన పట్ల తనకున్న గౌరవభావాన్ని కూడా ఇదే ట్వీట్ లో స్పష్టంగా చెప్పాడు.

ఈమధ్య రామ్ చరణ్ హీరోగా నటించిన ధృవ ఇంటలిజెంట్ విలన్ గా కనిపించిన అరవిందస్వామి డౌట్ కూడా చాలా ఇంటెలిజింట్ గా ఉంది. చట్టాలు చేసేవారు.. దానిని అమలు చేసేవారు రోజూ జాతీయ గీతం ఎందుకు ఆలపించరంటూ అతడు వ్యక్తం చేసిన డౌట్ అందరినీ ఆలోచింపజేసేదే.. అతడి డౌట్ కు మిగతా వాళ్లు ఎలా రెస్పాండవుతారో చూడాలి మరి