Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: వరద అదిరాడుగా!

By:  Tupaki Desk   |   13 Aug 2018 7:58 PM IST
ఫస్ట్ లుక్: వరద అదిరాడుగా!
X
మణిరత్నం సినిమా అంటేనే వెనుకటి జయాపజయాలతో సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా హైప్ వచ్చేస్తుంది. అద్భుతమైన కల్ట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని లిఖించుకున్న మణిరత్నం కొత్త సినిమా నవాబ్. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ మూవీ సిరీస్ లో భాగంగా మొదటగా అరవింద్ స్వామి లుక్ ని విడుదల చేసారు. వరదా గా చాలా డిఫరెంట్ గా మాస్ అవతారంలో కనిపిస్తున్న అరవింద్ స్వామిలో చాలా ఇంటెన్సిటీ కనిపిస్తోంది. మణిరత్నం సినిమాల ద్వారానే పాపులర్ అయిన అరవింద్ స్వామి మనకు ధృవ తో కం బ్యాక్ ఇచ్చాడు కానీ తమిళ అవకాశాల వల్ల అటువైపే ఉండిపోయాడు. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీలో శింబు-అరుణ్ విజయ్-సేతుపతి మిగిలిన హీరోలుగా నటిస్తుండగా అదితి హైదరి రావు-జ్యోతిక-ఐశ్వర్య హీరోయిన్ల పాత్రలు పోషిస్తున్నారు. అండర్ వరల్డ్ నేపథ్యంలో ఇది రూపొందుతోందని టాక్.

మణిరత్నం గత సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఆయనలో టెక్నీషియన్ మీద ఏ కంప్లయింట్ లేకపోయినా కమర్షియల్ గా సక్సెస్ కాక చేదు ఫలితాలనే ఇస్తున్నాయి. సఖి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయిన మణిరత్నం ఓకే బంగారంతో ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించినా ఆయన రేంజ్ మూవీ కాదనే కామెంట్ కూడా వచ్చింది.కార్తీ చెలియా కూడా ఫెయిల్యూర్ గానే మిగిలింది. అందుకే చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో దీన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. షూటింగ్ చాలా ఫాస్ట్ గా పూర్తి చేస్తున్న మణిరత్నం ఇందులో తొలుత నాని-కార్తీలను తీసుకునే ఆలోచన చేసినప్పటికీ యేవో సమస్యల వల్ల ఇద్దరు డ్రాప్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఇది ఆయన కం బ్యాక్ మూవీగా ఖచ్చితంగా సంచలనం రేపుతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.