Begin typing your search above and press return to search.

కాలాలో శివాజీరావు గైక్వాడ్

By:  Tupaki Desk   |   17 Jun 2017 5:23 AM GMT
కాలాలో శివాజీరావు గైక్వాడ్
X
కబాలి తర్వాత రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ పూర్తి చేసేసిన రజినీకాంత్.. తన మరుసటి చిత్రం కాలా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర కథ.. ముంబై గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది.

కాలా కరికులన్ మూవీలో తమిళ్ యాక్టర్ అరవింద్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈయన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. ఇతని కేరక్టర్ కు పెట్టిన పేరు ఆసక్తి కలిగిస్తోంది. రజినీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ ను.. అరవింద్ కేరక్టర్ కు పెడుతున్నారని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ రజినీ అసలు పేరు నుంచి కొంత భాగం తీసుకుని.. శివాజీ అంటూ శంకర్ సినిమాలో మాత్రమే ఉపయోగించారు. అలాగే కాలా చిత్రంలో మరో పాత్ర కూడా ఆసక్తి కలిగిస్తోంది. పొలిటికల్ లీడర్ రోల్ లో కనిపిస్తున్న నానా పటేకర్ కు భీమ్ జీ అనే పేరు పెడుతున్నట్లు తెలుస్తోంది.

పా రంజిత్ కు ట్విట్టర్ ఖాతా పేరు భీమ్ జీ కావడమే అసలైన విశేషం. మొదట ముంబైలో లో కాలా మూవీ షూటింగ్ జరిపి.. ఆ తర్వాత యూనిట్ అంతా చెన్నైకు షిఫ్ట్ కానుంది. మిగిలిన భాగం షూటింగ్ అంతా చెన్నైలోనే సెట్స్ వేసి నిర్మించేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. ఈ మూవీకి రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాత కావడం ఆసక్తి కలిగించే విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/