Begin typing your search above and press return to search.

#అర‌ణ్య: అస్సాం గిరిజ‌న రైతు క‌థ‌

By:  Tupaki Desk   |   15 Feb 2020 6:30 PM GMT
#అర‌ణ్య: అస్సాం గిరిజ‌న రైతు క‌థ‌
X
రానా దగ్గుబాటి .. పాన్ ఇండియా ట్ర‌య‌ల్స్ గురించి తెలిసిందే. సోలోగా త‌న‌ని తాను పాన్ ఇండియా స్టార్గా ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఆ క్ర‌మంలోనే అత‌డి స్క్రిప్ట్ సెలెక్ష‌న్ అమాంతం మారిపోయింది. ఇప్ప‌టికిప్పుడు న‌టిస్తున్న సినిమాల‌న్నీ పాన్ ఇండియా కేట‌గిరీనే. ప్ర‌భుసోల్మ‌న్ తో ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామా `ఆరణ్య` కోసం రానా చేస్తున్న సాహ‌సం గురించి తెలిసిందే. థాయ్ ల్యాండ్ లోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో క‌నీసం ఫోన్ కూడా అందుబాటులో లేని చోట షూటింగుల్లో పాల్గొన్నాడు. ఇటీవ‌ల రిలీజైన పోస్ట‌ర్లు.. టీజ‌ర్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఇక ఇందులో రానా గెట‌ప్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అత‌డి డీగ్లామ‌ర్ లుక్ వైర‌ల్ గా మారింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2 ఏకకాలంలో తెలుగు-తమిళం - హిందీలో రిలీజ్ చేస్తున్నారు. అర‌ణ్య - కదన్ - హాథీ మేరే సాథీ పేర్ల‌ తో విడుద‌ల‌వుతున్నాయి. రానా ఈ చిత్రంలో అవ‌తార్ - శివ‌ పుత్రుడు త‌ర‌హాలో ఓ డిఫ‌రెంట్ ఆహార్యం తో ర‌క్తి క‌ట్టించ‌బోతున్నాడు.

అర‌ణ్య లో త‌న రోల్ గురించి రానా చెప్పిన ఓ ఆస‌క్తిక‌ర సంగ‌తి ప్ర‌స్తుతం అభిమానుల్లో చ‌ర్చకు తావిచ్చింది. అర‌ణ్య మూవీ రెగ్యుల‌ర్ మూవీ కాదు. ఇది కూడా ఓ బ‌యోపిక్ మూవీనే. అస్సాం కి చెందిన జాదవ్ పయెంగ్ అనే పర్యావరణవేత్త కం గిరిజన రైతు జీవిత‌క‌థ‌ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇది ఓ రచన ఆధారిత పాత్ర అన్న సంగ‌తిని రానా రివీల్ చేశారు. గత 40 సంవత్సరాలుగా కాకులు దూర‌ని కార‌డ‌విలో నేల‌ను చ‌దును చేసి మొక్కలు నాటడం ద్వారా 1300 హెక్టార్ల బంజరును.. ఉపయోగించని భూములను అడవులుగా మార్చినందుకు జాదవ్ కు స‌ముచితమైన‌ పద్మశ్రీ అవార్డు ప్ర‌భుత్వం అంద‌జేసిందని రానా తెలిపారు.

``ఆరణ్య నా జీవితానికి నిజమైన అర్ధాన్ని నేర్పింది. థాయ్ లాండ్ షెడ్యూల్ లో చేరిన తర్వాతే ఆరణ్య లో నేను పోషించాల్సిన పాత్రకు సంబంధించిన‌ ఆత్మ ఏమిటో నాకు అర్థ‌మైంది. మొబైల్స్ లేకుండా గ‌డిపిన రోజులు గుర్తున్నాయి. బాహ్య‌ ప్రపంచం తో సంబంధం లేకుండా.. అస‌లు శబ్దం అన్న‌దే వినిపించ‌ని చోట‌.. నేను ఎవరో నేనేమిటో కనుగొన్నాను అని రానా అన్నారు. ఇంట్రెస్టింగ్ .. అమేజింగ్.. # అర‌ణ్య స్టోరి అస్సాం గిరిజ‌న రైతు క‌థ అన్న సంగ‌తి ఆస‌క్తిని పెంచుతోంది.