Begin typing your search above and press return to search.

ఆ ప్లాప్ ఎఫెక్ట్ 'విరాటపర్వం' పై పడనుందా..??

By:  Tupaki Desk   |   7 April 2021 5:30 PM GMT
ఆ ప్లాప్ ఎఫెక్ట్ విరాటపర్వం పై పడనుందా..??
X
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న టాలీవుడ్ హీరోలలో రానా ఒకరు. పాన్ ఇండియా లెవెల్ ఫేమ్ అయితే దక్కింది కానీ ఆ స్థాయిని సరైన సినిమాలతో నిలబెట్టుకోలేకపోతున్నాడు రానా. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత చాలా సినిమాలే చేసాడు కానీ ఏవి కూడా సరైన విజయాన్ని అందించలేకపోయాయి. అలాగే తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అంతా బాగానే సాగుతుంది కానీ హిట్స్ మాత్రం లేవు. నిజానికి 2017లో బాహుబలి-2, నేనే రాజు నేనే మంత్రి హిట్స్ తర్వాత రానా ఖాతాలో హిట్ పడలేదనే విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా వైడ్ ఏర్పడిన అటెన్షన్ మాత్రం హిట్స్ పరంగా కాకుండా ఎండార్స్ మెంట్ పరంగా కాష్ చేసుకుంటున్నాడని టాక్ నడుస్తుంది.

ఇటీవలే రానా 'అరణ్య' అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన అరణ్య బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. టాక్ పరంగా బాగానే ఉన్నప్పటికీ సినిమా కమర్షియల్ గా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. చివరికి అరణ్య డిజాస్టర్ టాక్ తో అటు నిర్మాతలను ఇటు డిస్ట్రిబ్యూటర్లను నష్టాల్లో ముంచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏప్రిల్ 30న రానా నటించిన కొత్తసినిమా 'విరాటపర్వం' మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా టీజర్, సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేసాయి కానీ అరణ్య ప్లాప్ ప్రభావం ఈ సినిమా పై పడనుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విరాటపర్వం క్రిటికల్ ఎక్లెయిమ్ పొందుతుందని అంటున్నారు కానీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. నక్సల్స్ ఉద్యమం నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ హైలైట్ అయ్యే అవకాశం ఉందని టాక్.