Begin typing your search above and press return to search.

ఆ సినిమా గుర్తొస్తే తప్పు కాదు

By:  Tupaki Desk   |   3 Nov 2017 10:04 AM IST
ఆ సినిమా గుర్తొస్తే తప్పు కాదు
X
మెగాస్టార్ కమ్ చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యాక బోలెడు స్టోరీలు విని చివరకు ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన కత్తి సినిమా వైపే మొగ్గు చూపాడు. తమిళంలో విజయ్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా కథతో వి.వి.వినాయక్ డైరెక్షన్ లో ఖైదీ నెంబర్ 150 సినిమా తీశాడు. ఇది రికార్డులు తిరగరాసేంత హిట్ కొట్టింది.

ఖైదీనెంబర్ 150 మూలకథ నీరూరు అనే గ్రామ ప్రజలు నీటికోసం చేసిన పోరాటం బేస్ గా నడుస్తుంది. తాజాగా నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో అరమ్ అనే సినిమా వస్తోంది. ఇందులో నయనతార జిల్లా కలెక్టర్ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అచ్చం కత్తి సినిమా లేడీ ఓరియంటెడ్ గా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందనిపిస్తుంది. కత్తి సినిమాలో చూపించిన నీటి కష్టాలు.. జలాల కోసం కార్పొరేట్ కంపెనీలు వేసే ఎత్తుగడలు... వాటికి తోడయ్యే గవర్నమెంట్ అధికారుల అక్రమాలు.. ఇలా ఒకటేంటి చాలా సీన్లు అలా చూసినట్టే అనిపిస్తుంటాయి. ట్రయిలర్ చూసేపాటికి తమిళ జనాలందరికీ కత్తి సినిమా ఓసారి గిర్రున కళ్లముందు తిరుగుతుంది. కాన్సెప్ట్ మంచిదే అయినా మరీ ఎక్కువగా కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది.

అరమ్ సినిమాను తెలుగులో కర్తవ్యం పేరిట డబ్బింగ్ చేస్తున్నారు. ట్రిడెంట్ ఆర్ట్స్ బ్యానర్ పై ఆర్. రవీంద్రన్ ఈ సినిమాను తెలుగులోకి తెస్తున్నారు. గోపి నయనార్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు జనాల సంగతి అటుంచి తమిళంలో అయినా అసలు ఈ సినిమాను చూస్తారా?