Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: అరకు రోడ్ లో.. విషయం ఉందే
By: Tupaki Desk | 13 Sept 2016 5:48 PM ISTపూరీ జగన్నాథ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన సాయిరాం శంకర్.. కెరీర్ ప్రారంభంలోనే మంచి గుర్తింపు సంపాదించేశాడు. కానీ ఆ తర్వాత మాత్రం జోరు చూపించలేక వెనకబడిపోయాడు. పక్కా మాస్ కుర్రాడి లుక్స్ తో ఉండే ఈ హీరో.. ఇప్పుడు అరకు రోడ్ లో అంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రకరకాల కారణాలతో రిలీజ్ లేట్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది.
కొమరంపులిలో పవన్ హీరోయిన్ నికీషా పటేల్.. అరకు రోడ్ లో చిత్రానికి గాను సాయిరాం శంకర్ తో జోడీ కట్టింది. ఈ మూవీ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా.. పెళ్లి సెటిల్ కానీ నత్తి హీరోగా సాయిరాం శంకర్ కామెడీ పండించేశాడు. ఇక మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం అన్నట్లుగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను ట్రైలర్ లోనే వదిలేశారు. ముందు కాసేపు పక్కా కామెడీ అనిపించేలా ఉన్న ట్రైలర్.. సగం నుంటి టర్న్ తీసుకుని థ్రిలర్ గా మారిపోయింది.
అరకు రోడ్ లో లారీలు మాయం అయిపోవడం మిస్టరీ కాగా.. ఆ సమస్యలో హీరో నడిపే లారీ కూడా ఇరుక్కుపోతుంది. ఇక్కడ మొదలయ్యే సమస్య హీరో ప్రాణాల మీదకు తెచ్చేయగా.. ట్రైలర్ లాస్ట్ ఫ్రేమ్ లో తలపై గన్ పెట్టిన వ్యక్తి ని చూసి సాయిరాం శంకర్ షాక్ అవుతాడు. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది కాబట్టి.. అంత ఇంట్రెస్ట్ సినిమా కూడా క్రియేట్ చేస్తే.. ఈ హీరో ఖాతాలో ఓ హిట్ పడ్డట్టే.
