Begin typing your search above and press return to search.

అరకు రోడ్ లో చాలా థ్రిల్స్ ఉన్నాయ్

By:  Tupaki Desk   |   15 Feb 2016 5:09 AM GMT
అరకు రోడ్ లో చాలా థ్రిల్స్ ఉన్నాయ్
X
ఓ ప్రయాణంలో అరకు రోడ్డులో.. ఏం జరిగింది? ఇదే కాన్సెప్ట్ గా తీసుకుని ఓ మూవీ తెరకెక్కుతోంది. పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరాం శంకర్ పవన్ కళ్యాణ్ కొమరం పులి హీరోయిన్ నికీష్ పటేల్ లు జంటగా నటించిన 'అరకు రోడ్ లో' టీజర్ విడుదలయింది. ఫస్ట్ షాట్ ఒక్కటి హీరో ఇంట్రడక్షన్ కి ఉపయోగించి.. మిగిలినదంతా టెక్నికల్ గా థ్రిల్లర్ ని తలపించాడు డైరెక్టర్.

అరకు రోడ్ లో టీజర్ కట్ చేసిన విధానాన్ని కూడా పొగడాల్సిందే. ఇదో లాంగ్ జర్నీ, అందులో ఎదురయ్యే సంఘటనల సమాహారం అనే విషయాన్ని రెండు మూడు షాట్స్ తోనే అర్ధం అయ్యేలా చెప్పడంతో.. మిగతా టీజర్ పై ఆసక్తి నెలకొంటోంది. థ్రిల్స్ విషయంలో మంచి కేర్ తీసుకున్నారు. సాధారణంగా థ్రిల్లర్ అంటే ఒకటీ అరా షాకింగ్స్ సరిపెట్టేస్తారు కానీ.. అరకు రోడ్ కోసం మాత్రం చాలానే ప్రిపేర్ చేసినట్లుగన్నారు. సరిగ్గా చూస్తే టీజర్ లోనే ఐదారు థ్రిల్స్ కనిపిస్తాయి.

చాలా సంవత్సరాలుగా హిట్ కోసం కష్టపడుతున్న సాయిరాం శంకర్ కు ఈ చిత్రం హిట్ కావడం చాలా ముఖ్యం. అలాగ నికీషా పటేల్ కూడా ఇంట్రడక్షన్ లోనే తనకొచ్చిన భారీ ఆఫర్ ఉపయోగించుకోలేక, ఇప్పుడు చిన్న సినిమాలు చేసుకుంటోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ తో.. డైరెక్టర్ వాసుదేవ్ మంచి ఔట్ పుట్ నే రాబట్టాడు. టీజర్ ని ఇంత థ్రిల్ ప్యాక్డ్ గా రూపొందించడంలోనే దర్శకుడి ట్యాలెంట్ అర్ధమవుతుంది.