Begin typing your search above and press return to search.

బాఫ్టా 2021 ఇండియా జ్యూరీ అధ్య‌క్షుడిగా ఏ.ఆర్.రెహమాన్

By:  Tupaki Desk   |   20 April 2021 8:00 AM IST
బాఫ్టా 2021 ఇండియా జ్యూరీ అధ్య‌క్షుడిగా ఏ.ఆర్.రెహమాన్
X
బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) నెట్ ఫ్లిక్స్ మద్దతుతో తొలి BAFTA బ్రేక్ త్రూ ఇండియా ప‌రిశోధ‌క‌ జ్యూరీ సభ్యుల జాబితాను ప్రకటించింది. సినిమాలు స్పోర్ట్స్ టెలివిజన్ పరిశ్రమల నుండి ప్రముఖులు నిపుణులు ఈ సంవత్సరం ఈ గౌర‌వాన్ని అందుకున్నారు. జ్యూరీకి బాఫ్టా బ్రేక్ త్రూ ఇండియా అంబాసిడర్ ఏ.ఆర్ రెహమాన్ అధ్యక్షత వహిస్తారు.

బాఫ్టా బ్రేక్‌త్రూ ఇండియా కోసం దరఖాస్తు చేసుకోవాలని బాఫ్టా దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులను ఇటీవ‌ల‌ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా చలనచిత్రాలు గేమ్స్ టెలివిజన్ పరిశ్రమల నుండి అధిక సంఖ్యలో ప్ర‌ముఖులు ఈ మూడు పరిశ్రమలలో ఉన్నందున వారిని ఆహ్వానించారు.

2021 జూరీ జాబితా ఇదీ:

ఎఆర్ రెహమాన్ - జ్యూరీ చైర్ (మ్యూజిక్ కంపోజర్)
అనుపమ్ ఖేర్ (నటుడు)
చారు దేసోడ్ట్ (మాజీ బాఫ్టా బ్రేక్ త్రూ & గేమ్స్ ప్రొడ్యూసర్)
కృష్ణేందు మజుందార్ (బాఫ్టా చైర్ & టీవీ నిర్మాత)
మీరా నాయర్ (దర్శకుడు / రచయిత / నిర్మాత)
మోనికా షెర్గిల్ (కంటెంట్- నెట్ ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్)
షోనాలి బోస్ (దర్శకుడు / రచయిత / నిర్మాత)
సిద్ధార్థ్ రాయ్ కపూర్ (రాయ్ కపూర్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు & నిర్మాత)

బాఫ్టా బ్రేక్ త్రూ ఇండియా అంబాసిడర్ మరియు జ్యూరీ చైర్మ‌న్ ఏ.ఆర్ రెహమాన్ మాట్లాడుతూ,.. “బాఫ్టా అనేది భారతదేశం నుండి వచ్చిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక‌ వేదిక. దాని బ్రేక్ త్రూ ఇండియా జ్యూరీలో భాగం కావడం నాకు ద‌క్కిన అరుదైన‌ గౌరవం. భారతదేశంలో చాలా మంది క్రియేటివిటీ ఉన్న‌వారు తమ కళను ప్రపంచస్థాయికి తీసుకురావాలని భారతదేశం శక్తివంతమైన విభిన్న సంస్కృతిని ప్రదర్శించాల‌ని కోరుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు వారు మానసిక ప‌ర‌మైన‌.. అలాగే ఇత‌రుల‌చే బాహ్య ఉచ్చులను ఎదుర్కొంటారు. ఈ బ్లాక్ లను చర్చించడానికి సృజనాత్మకత సమస్యలపై నిమగ్నమవ్వడానికి సరైన కనెక్షన్ ఇవ్వడానికి.. నెట్‌వర్క్ చేయడానికి అవకాశం క‌ల్పిస్తాం. ఇది దేశంలో మనకున్న ప్రతిభకు ఎంతో మేలు చేస్తుంది. బ్రేక్‌త్రూ ద్వారా మేము కళాకారులకు మా జ్ఞానాన్ని కనెక్టివిటీని అందిస్తాం. అలాగే వారి నైపుణ్యాన్ని గొప్ప‌గా పెంపొందించుకుంటారు. ప్రపంచంపై వారి ముద్ర ప‌డేలా సహాయపడ‌తాం. భారతదేశం నమ్మశక్యం కాని కళాకారులకు నిలయం. అంద‌రం ప్ర‌కాశించే సమ‌య‌మిది`` అని అన్నారు. హానరీల తుది జాబితా మే 2021 ప్రారంభంలో ప్రకటించనున్నారు.