Begin typing your search above and press return to search.

హాలీవుడ్‌ మూవీకి తమిళ స్టార్‌ డైరెక్టర్‌ హెల్ప్‌

By:  Tupaki Desk   |   15 Feb 2019 8:21 AM GMT
హాలీవుడ్‌ మూవీకి తమిళ స్టార్‌ డైరెక్టర్‌ హెల్ప్‌
X
హాలీవుడ్‌ మూవీస్‌ కు ఇండియాలో మంచి మార్కెట్‌ ఉంది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో హాలీవుడ్‌ సినిమాలకు విపరీతమైన ఆధరణ ఉంది. హాలీవుడ్‌ చిత్రాలు వందల కోట్లు వసూళ్లు చేస్తూ వస్తున్నాయి. హాలీవుడ్‌ అడ్వెంచర్‌ మూవీ ప్రాంచైజీ అయిన అవెంజర్స్‌ కు ఇండియాలో గతంలో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 'అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌' రూపొందుతోంది. త్వరలోనే రాబోతున్న ఈ చిత్రాన్ని ఇండియాలో భారీగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

డబ్బింగ్‌ వర్షన్‌ కు భారీ క్రేజ్‌ ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 'అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌' తమిళ వర్షన్‌ కి తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ డైలాగ్స్‌ రాయబోతున్నాడట. కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, హిందీ సినీ ఇండస్ట్రీల్లో కూడా మురుగదాస్‌ సక్సెస్‌ లు దక్కించుకున్నాడు. తన సినిమాలకు తానే డైలాగ్స్‌ రాసుకునే మురుగదాస్‌ ఇతర దర్శకుల సినిమాలకు మాత్రం ఎప్పుడు రచన సహకారం అందించింది లేదు. కాని మొదటి సారి అవెంజర్స్‌ కోసం కలం పట్టబోతున్నాడు.

ఇండియాలో అత్యధికంగా ఈ చిత్రం బిజినెస్‌ చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ స్టార్‌ రైటర్స్‌ లేదా డైరెక్టర్స్‌ తో డైలాగ్స్‌ రాయించేందుకు చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే మురుగదాస్‌ తో 'అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌' కు డైలాగ్స్‌ రాయిస్తున్నారు. మురుగదాస్‌ డైలాగ్స్‌ తో తమిళంలో అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ కు భారీ క్రేజ్‌ దక్కడం ఖాయం. మరో వైపు మురుగదాస్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌తో మూవీకి ఏర్పాట్లు చేస్తున్నాడు. త్వరలోనే రజినీకాంత్‌ మూవీ పట్టాలెక్కబోతుంది.