Begin typing your search above and press return to search.

ఒప్పేసుకున్న దాసు - సర్కార్ సేఫ్

By:  Tupaki Desk   |   30 Oct 2018 10:07 AM GMT
ఒప్పేసుకున్న దాసు - సర్కార్ సేఫ్
X
గత కొద్దిరోజులుగా విజయ్ ఫ్యాన్స్ కంటి మీద కునుకును దూరం చేరిన సర్కార్ కాపీ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. నిన్నటి దాకా తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి అందరు కంకణం కట్టుకున్నారని మండిపడిన దర్శకుడు మురగదాస్ ఎట్టకేలకు రాజీ మంత్రం పఠించాడు. వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత పన్నెండేళ్ల క్రితమే సెంగోల్ అనే పేరుతో కథను రిజిస్టర్ చేసుకున్నానని దాన్నే చిన్నపాటి మార్పులతో సర్కార్ గా తీసారని ఇటీవలే కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాగ్యరాజ్ రెండు కథలు ఒకేలా ఉన్నాయని ధ్రువీకరించడంతో పాటు సర్టిఫికెట్ కూడా జారీ చేయడంతో గురువారం ఫైనల్ హియరింగ్ రాక ముందే సన్ సంస్థతో పాటు మురగదాస్ టైటిల్ కార్డులో క్రెడిట్ తో పాటు అతని నిబంధనకు ఒప్పుకున్నట్టు తెలిసింది.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మురుగదాస్ లాంటి దర్శకుడు ఇలా చేయకుండా ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడగా మరొకొందరు హుందాగా జెంటిల్ మెన్ లా దాస్ తప్పు ఒప్పుకుని నిజాయితీ ఋజువు చేసుకున్నారని సమర్ధించుకున్నారు. ఏది ఏమైనా ఈ పనేదో ముందే చేసుకుంటే బాగుండేది. నవంబర్ 6న విడుదల కానున్న సర్కార్ కు కోర్టు తీర్పు ఏ మాత్రం వ్యతిరేకంగా వచ్చినా రిలీజ్ వాయిదా పడి తీవ్ర నష్టం వచ్చేది. దాని కన్నా వరుణ్ రాజేంద్రన్ పేరు ప్లస్ రెమ్యునరేషన్ చాలా తక్కువ కావడంతో ఫైనల్ గా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సో ఇక అన్ని టెన్షన్లు తొలగిపోయాయి. జనవరిలో అజ్ఞాతవాసి మొదలుకుని ఇప్పటి దాకా సర్కార్ క్రేజీ సినిమాల విషయంలో కాపీ వివాదాలు కొనసాగుతూనే ఉండటం గమనార్హం