Begin typing your search above and press return to search.

యాక్షన్‌ చిత్రాలకు తాత ఈ 'ఆక్వామ్యాన్‌'

By:  Tupaki Desk   |   16 Nov 2018 3:30 AM GMT
యాక్షన్‌ చిత్రాలకు తాత ఈ ఆక్వామ్యాన్‌
X
ఇప్పటి వరకు హాలీవుడ్‌ లో ఎన్నో యాక్షన్‌ చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్‌ హీరోలు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు హాలీవుడ్‌ లో వచ్చిన స్పైడర్‌ మ్యాన్‌ - బ్యాట్‌ మన్‌ - ఐరన్‌ మ్యాన్‌ - సూపర్‌ మ్యాన్‌ పాత్రలు పిల్లల నుండి పెద్దల వరకు అందరి అభిమానంను దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు వారి దారిలో మరో యాక్షన్‌ హీరో అక్వా మ్యాన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా అక్వామ్యాన్‌ తన సందడిని డిసెంబర్‌ 21న మొదలు పెట్టబోతున్నాడు.

హాలీవుడ్‌ ప్రసిద్ద దర్శకుడు జేమ్స్‌ వాన్‌ దర్శకత్వంలో అత్యధ్బుతమైన టెక్నాలజీతో - అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందిన ‘ఆక్వామ్యాన్‌’ చిత్రం గత రికార్డులను బద్దలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపుగా 1200 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రంలో ఎక్కువ శాతం గ్రాఫిక్స్‌ ప్రధాన సాగుతుందని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన మేకింగ్‌ వీడియో మరియు అయిదు నిమిషాల మరో వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత సినిమా ‘అవతార్‌’ను మించి పోవడం ఖాయం అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన యాక్షన్‌ చిత్రాలకు ఇది తాతలా ఉందనే టాక్‌ వినిపిస్తుంది. ఇకపై ఆక్వామ్యాన్‌ గురించి జనాలు ప్రత్యేకంగా మాట్లాడుకుంటారనిపిస్తోంది.

ఇప్పటి వరకు హాలీవుడ్‌ లో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న చిత్రంగా ‘అవతార్‌’ ఉంది. ఇప్పుడు ఆ రికార్డును ఆక్వామ్యాన్‌ బ్రేక్‌ చేయడం ఖాయంగా హాలీవుడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. అద్బుతమైన విజువల్స్‌ తో ప్రముఖ నటీనటుల యాక్షన్‌ సీక్వెన్స్‌ తో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను ఈ చిత్రం విడుదల చేస్తున్న వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ వారు తెలియజేస్తున్నారు. ఇండియాలో ఈ చిత్రం ఇంగ్లీష్‌ - హిందీ - తెలుగు ఇంకా పలు భాషల్లో విడుదల కాబోతుంది.