Begin typing your search above and press return to search.

నంది అవార్డులు ఉన్నాయ్ బాస్

By:  Tupaki Desk   |   22 Dec 2016 11:39 AM GMT
నంది అవార్డులు ఉన్నాయ్ బాస్
X
తెలుగు సినీ జనాలకు నంది అవార్డులు ప్రతిష్టాత్మకం. ఏటా ఈ అవార్డుల కోసం అటు సినిమా వాళ్లు.. ఇటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసేవాళ్లు. కానీ తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక ఈ అవార్డులు అటకెక్కేశాయి. అటు తెలంగాణ ప్రభుత్వం.. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల పాటు ఈ అవార్డుల ఊసే ఎత్తలేదు. ఐతే ఈ మధ్య తెలంగాణ సర్కారు సినిమా అవార్డుల మీద దృష్టిపెట్టింది. నంది అవార్డుల స్థానంలో ‘సింహా’ అవార్డుల్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన విధివిధానాలు ఖరారవుతున్నాయి. ఇంతలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ కదలికి రావడం విశేషం. నంది అవార్డుల్ని అదే పేరుతో పునరుద్ధరించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.

చివరగా 2011లో నంది అవార్డులివ్వగా.. ఇప్పుడు 2012.. 2013 సంవత్సరాలకు అవార్డులు ప్రకటించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. 2012 వార్షిక అవార్డుల కోసం సీనియర్ నటి జయసుధ నేతృత్వంలో 13 మందితో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. 2013 అవార్డుల కోసం సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు అప్పగించింది. రవిబాబు.. సిద్ధార్థ.. శేఖర్ కమ్ముల.. చంద్ర సిద్ధార్థ.. నందిని రెడ్డి.. కవిత.. కాదంబరి కిరణ్.. సన.. ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ఈ కమిటీల్లో ఉన్నారు. నంది అవార్డులతో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు.. రఘుపతి వెంకయ్య అవార్డు.. బీఎన్ రెడ్డి అవార్డు.. నాగిరెడ్డి అవార్డులు కూడా ప్రకటించనున్నారు. ఈ కమిటీలో రాఘవేంద్రరావు.. నందమూరి బాలకృష్ణ.. మురళీ మోహన్.. రమేష్ ప్రసాద్.. కృష్ణంరాజు.. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/