Begin typing your search above and press return to search.

#AP వ‌ర‌ద‌లు: కొణిదెల‌ 50ల‌క్ష‌లు.. అల్లు 35 లక్షలు

By:  Tupaki Desk   |   2 Dec 2021 10:36 AM GMT
#AP వ‌ర‌ద‌లు: కొణిదెల‌ 50ల‌క్ష‌లు.. అల్లు 35 లక్షలు
X
వ‌ర‌ద‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి క‌ష్ట‌స‌మ‌యాల్లో టాలీవుడ్ ఎప్పుడూ గొప్ప‌గా స్పందించింది. ఈసారి కూడా అందుకు ఏమాత్రం త‌గ్గ‌లేదు. రెండురోజులుగా టాలీవుడ్ స్టార్లు ల‌క్ష‌ల్లో విరాళాల్ని ప్ర‌క‌టిస్తూ ధాతృత్వాన్ని చాటుకున్నారు. ప‌లువురు అగ్ర హీరోలు ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు తమ సహాయాన్ని అందజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్ చోరో 25ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. కొణిదెల కాంపౌండ్ నుంచే 50ల‌క్ష‌లు ఏపీ సీఎం స‌హాయ‌నిధికి చేరుకుంది. వరదలతో కడప- చిత్తూరు- నెల్లూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సినీ తారలతో పాటు పలు రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు కూడా వరద బాధితులకు తమ సహాయాన్ని అందిస్తున్నాయి.

ఇప్పుడు ఈ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. రూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు ప్ర‌క‌టించారు. ``ఇటీవలి వరదల వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా సాయ‌మిది. పున‌రావాస ప్రయత్నాలకు సహాయం చేయడానికి @ఏపీCM రిలీఫ్ ఫండ్ కి 25 లక్షలు అందిస్తాను`` అని బన్నీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వెల్ల‌డించారు. అల్లు అర్జున్ స‌హా త‌న‌ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా రూ.10లక్షల‌ విరాళాన్ని ప్రకటించింది. ఓవ‌రాల్ గా అల్లు కాంపౌండ్ నుంచి 35ల‌క్ష‌లు సీఎం నిధికి చేరుకుంటోంది. మహేష్ బాబు- జూనియర్ ఎన్టీఆర్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక్కొక్కరు 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

అల్లు అర్జున్ తదుపరి చిత్రం `పుష్ప: ది రైజ్` లో కనిపించనున్నారు. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కానుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత ఓ స్పెష‌ల్ సాంగ్ లో క‌నిపించ‌నుంది.