Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ టికెటింగ్ శ్రేయస్కరమే కానీ...! AP ఫిల్మ్ ఛాంబర్ డౌట్లు!!
By: Tupaki Desk | 9 Oct 2021 8:00 AM ISTఈమధ్య కాలంలో సినిమా ఆన్లైన్ టికెటింగ్ విధానంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏ పి. ఛాంబర్ తరుపున ఏర్పాటు చేసిన సమావేశంలో ఏ. పి ఛాంబర్ ప్రెసిడెంట్ అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ సినిమా టికెట్స్ ధరల విషయంలో థియేటర్ ఆక్యుపెన్సీ విషయంలో పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ విధానం ఉత్తమ మైనదని ఆ విధానాన్ని అమలుచేయమని ఛాంబర్ తరుపున ఎన్నో సంవత్సరముల నుంచి గవర్నమెంట్ ను అడుగుతున్నామని అది ఇప్పుడు అమలుచేయాలని ఏ. పి. గవర్నమెంట్ నిర్ణయించడం శుభపరిణామం అని అన్నారు. ఆ నిర్ణయం తీసుకున్న వై. యస్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఛాంబర్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఛాంబర్ సెక్రటరీ జె. వి. మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే ఎ, బి సెంటర్స్ లో చాలా థియేటర్స్ లో ఆన్లైన్ విధానం వుందని మిగతా థియేటర్స్ లో కూడా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా అంతా ట్రాన్సపరెంట్ గా ఉండి ఎక్కడా వివాదాలు తలెత్తవని తెలిపారు. ఆన్లైన్ విధానం ప్రభుత్వ అదీనంలో ఉండటం తప్పు కాదని.. కానీ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు థియేటర్స్ కు వచ్చేలా చేయాలనీ.. అప్పుడే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని కోరారు.
మిగిలిన కమిటీ సభ్యులు విజయవర్మ- చైతన్య- బోడపాటి మురళి మాట్లాడుతూ ఆన్లైన్ విధానాన్ని స్వాగత్తిస్తున్నామని.. బి- సి సెంటర్స్ టికెట్స్ రేట్స్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి కొంత పెంచితే మంచిదని అప్పుడే థియేటర్ వ్యవస్థ పదిలంగా ఉంటుందని తెలిపారు. మనకు ఏదైనా సమస్య ఉంటే గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేసి పరిష్కరించుకోవాలి కానీ దానిని వివాదం చేయడం మంచిది కాదని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారికి, సినిమా వాళ్ళ విషయంలో కీలక పాత్ర వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు పేర్ని నానీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆన్ లైన్ ఉంటే బ్లాక్ టికెటింగ్ ఉండదా?
ప్రభుత్వ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా టిక్కెట్లు అమ్మితే బ్లాక్ టికెటింగ్ వ్యవస్థ అంతమైనట్టేనా? అని ఏపీ ఛాంబర్ సెక్రటరీ జేవీ మోహన్ గౌడ్ ని `తుపాకి` ప్రశ్నించగా.. దొంగ దారులు వెతికేవారికి దొడ్డి దారులు తెలిసిన వారికి అడ్డంకి వేయడం కష్టమేనని దానిపై ప్రభుత్వాలు ప్రతిరోజూ మానిటర్ చేయలేవని అన్నారు. కొన్ని టిక్కెట్లను మామూలుగా డోర్ వెనక నుంచి విక్రయిస్తే థియేటర్ లోనికి పంపిస్తే దానిని ప్రభుత్వ అధికారులు ప్రతిసారీ కనిపెట్టే ప్రయత్నం చేయరు కదా.. అని సందేహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు వ్యవస్థ ఇలాగే సాగిందని ఒక ఎగ్జిబిటర్ గా అనుభవంతో తెలిపారు.