Begin typing your search above and press return to search.

బాల‌య్య ఏదైనా స‌రే అన్ స్టాప‌బుల్‌..

By:  Tupaki Desk   |   8 Jan 2022 12:30 AM GMT
బాల‌య్య ఏదైనా స‌రే అన్ స్టాప‌బుల్‌..
X
`అఖండ‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో బాల‌కృష్ణ మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. బోయ‌పాటితో క‌లిసి ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి చేసిన ఈ మూవీ బాల‌య్య‌కు బంప‌ర్ హిట్ ని అందించింది. అంతే కాకుండా వ‌సూళ్ల ప‌రంగానూ రికార్డులు సృష్టించింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పెద్ద సినిమాల ప‌రిస్థితి ఏంట‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుబులు మొద‌లైన వేళ `అఖండ‌`మైన విజ‌యంతో ఆభ‌యాల‌ని పోగొట్టి ఇండ‌స్ట్రీకి కొత్త ధైర్యాన్ని అందించింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో బాల‌య్య రెట్టించిన ఉత్సాహంతో వున్నారు.

సినిమా ఊహించ‌ని స్థాయిలో విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డంతో మంచి జోష్ తో వున్న బాల‌కృష్ణ `ఆహా` ఓటీటీ కోసం `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బికె`టాక్ షో లో హంగామా చేస్తున్నారు. ఇండ‌స్ట్రీకి చెందిన ఫిల్మ్ సెల‌బ్రిటీల‌ను త‌న‌దైన స్టైల్లో ఆట‌ప‌ట్టిస్తూ బాల‌య్య చేస్తున్న హ‌ల్ చ‌ల్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు సోష‌ల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. కొంత మంది బాల‌య్య‌ను ట్రోల్ చేస్తుంటే మ‌రి కొంత మంది జై బాల‌య్య అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఓటీటీ వేదిక‌గా బాల‌య్య చేస్తున్న హంగామా బాల‌య్య‌ని ఇండ‌స్ట్రీలో మోస్ట్ వాంటెడ్ సోష‌ల్ మీడియా స్టార్ గా మార్చింద‌ట‌. రానా అన్న‌ట్టుగా అంతా పాసింజ‌ర్ ట్రైన్ ల‌లో వ‌స్తుంటే స‌డ‌న్ గా బుల్లెట్ ట్రైన్ వేసుకొచ్చిన‌ట్టుగా వుంది బాల‌య్య దూకుడు. ప్ర‌స్తుతం ఆయ‌న జోరు చూస్తున్న వాళ్లు బాల‌య్య ఏదైనా స‌రే అన్ స్టాప‌బుల్ అంటూ బుల్డోజ‌ర్ లా దూసుకుపోతున్నాడ‌ని కామెంట్ లు చేస్తున్నారు. ఇదిలా వుంటే బాల‌కృష్ణ `అఖండ‌` త‌రువాత మ‌రో మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

`క్రాక్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ఫుల్ జోష్ లో వున్న గోపీచంద్ మ‌లినేని ఈ మూవీకి డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల నిర్మాణ సంస్థ‌గా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా క‌న్న‌డ స్టార్ దునియా విజ‌య్ న‌టిస్తున్నారు. `క్రాక్‌`లో జ‌య‌మ్మ‌గా ఆక‌ట్టుకున్న వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కూడా ఇందులో కీల‌క పాత్ర పోషిస్తోంది.

ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని త్వ‌ర‌లోనే ప్రారంభించ‌బోతున్నారు. తొలి షెడ్యూల్ పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నార‌ట‌. గ‌త కొంత కాలంగా అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో బాల‌య్య సినిమా చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఈ ప్రాజెక్ట్ కు బాల‌కృష్ణ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

దీంతో ఈ మూవీని కూడా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నార‌ట‌. ఈ మూవీతో పాటు గోపీచంద్ మ‌లినేని మూవీని కూడా ఒకేసారి పూర్తి చేయాల‌ని బాల‌య్య ప్లాన్ చేసుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది. బాల‌య్య స్పీడుని చూస్తున్న వారంతా బుల్లెట్ స్పీడుతో దూకుడు చూపిస్తున్నార‌ని చెప్పుకుంటున్నారు.