Begin typing your search above and press return to search.

OTT లో హార‌ర్ సిరీస్ కి జ‌క్క‌న్న ప్ర‌చార‌మా?

By:  Tupaki Desk   |   19 Jun 2022 6:46 PM IST
OTT లో హార‌ర్ సిరీస్ కి జ‌క్క‌న్న ప్ర‌చార‌మా?
X
టీవ‌లి కాలంలో టాప్ సెల‌బ్రిటీల‌తో పెద్ద ప్రచారం అందుకుంటున్న వెబ్ సిరీస్ `అన్యాస్ ట్యుటోరియల్`. పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సౌమ్య శర్మ ర‌చ‌యిత‌. బాహుబ‌లి ఫ్రాంఛైజీ క‌ర్త‌లు ఈ సిరీస్ కి నిర్మాత‌లు. ఆర్కా మీడియా పతాకంపై శోబు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని ఈ సిరీస్ ని నిర్మించారు. ఇది ఆహా OTT లో ఒరిజిన‌ల్ సిరీస్.

ఈ వెబ్ సిరీస్ లో రెజీనా కసాండ్రా- నివేదిత సతీష్- అగస్త్య త‌దిత‌రులు నటించారు. చాలా కాలం క్రితమే చిత్రీకరణ పూర్తి కాగా స్ట్రీమింగుకి ముందు ప్రస్తుతం ప్ర‌చారంలో వేగం పెరిగింది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ అన్య ట్యుటోరియల్ టీజర్ ను రిలీజ్ చేసి టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా మేకర్స్ ఉత్కంఠ రేకెత్తించే రివ‌ర్టింగ్ ట్రైలర్ ను విడుద‌ల‌ చేసారు. ఈరోజు సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ SS రాజమౌళి ఆహా ద్విభాషా సైబర్ హారర్ సిరీస్ `అన్యాస్ ట్యుటోరియల్` ట్రైల‌ర్ ను లాంచ్ చేసి టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఖాళీ బంగ్లా.. లోన్ లీగా అమ్మాయి.. ఇంత‌లోనే ఊహ‌కు అంద‌ని విధంగా భ‌య‌పెట్టే షాడోస్ రంగ ప్ర‌వేశం.. అస‌లు దెయ్యాలంటే భ‌య‌ప‌డ‌ని అమ్మాయే చివ‌రికి దెయ్యం ప‌ట్టిన దానిగా ప్ర‌వ‌ర్త‌న‌.. ఇక చెల్లితో ఘ‌ర్ష‌ణ ప‌డే యువ‌తిగా రెజీనా ఈ ట్రైల‌ర్ లో క‌నిపించారు. హాలీవుడ్ మిర్ర‌ర్స్ స‌హా ప‌లు హార‌ర్ చిత్రాల స్ఫూర్తి ఈ సినిమాలో క‌నిపిస్తోంది. ట్రైలర్ ఆద్యంతం భ‌యం క‌ల్పించే గ‌గుర్పాటుకు గురి చేసే కంటెంట్ అంచనాలను మ‌రో లెవ‌ల్ కి పెంచింద‌ని చెప్పాలి. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఫియ‌ర్ ఫ్యాక్ట‌ర్ కి సంబంధించిన ఎలివేష‌న్ షాట్స్ తో ఆక‌ట్టుకుంది. ఈ 7 ఎపిసోడ్ ల సిరీస్ విడుదలవుతుండ‌గా ట్రైల‌ర్ తో మ‌రింత ఆస‌క్తిని పెంచ‌గ‌లిగార‌ని చెప్పాలి. అన్య ట్యుటోరియల్ సిరీస్ ఇద్దరు సోదరీమణుల మధ్య వార్ గా కనిపిస్తోంది. ఈ సిరీస్ తో పల్లవి గంగిరెడ్డి దర్శకులుగా పరిచయం అవుతున్నారు. 1జూలై 2022న `ఆహా` ఏడు ఎపిసోడ్ ల‌తో సిరీస్ ని ప్రసారం చేస్తుంది.