Begin typing your search above and press return to search.

పవన్ తో నటించేందుకు ఆతృతగా ఉన్నా - రానా

By:  Tupaki Desk   |   21 Dec 2020 5:40 PM IST
పవన్ తో నటించేందుకు ఆతృతగా ఉన్నా - రానా
X
‘‘సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో కలిసి నటించాను. కానీ.. మన పవర్ స్టార్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. సెట్లో అడుగు పెట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు బళ్లాల దేవ దగ్గుబాటి రానా.

మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్, రానా నటించబోతున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లాంఛనంగా సోమవారం ప్రారంభించారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకీ అట్లూరి, నిర్మాతలు ఎస్ రాధా కృష్ణ, ‘దిల్’ రాజు తదితరులు పాల్గొన్నారు.

కాగా.. ఈ చిత్రంలో పవన్ తోపాటు నటించే మరో హీరో ఎవరనేది చాలా రోజులపాటు చర్చ జరిగిన విషయం తెలిసిందే. పలువురి పేర్లు వినిపించగా.. చివరకు రానా ఫైనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ఫిల్మ్ మేకర్స్.. ఒక చిన్న వీడియోతో రానాను స్వాగతించారు. థ్రిల్ అయిన రానా.. సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు.

‘‘ఇప్పటివరకూ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్‌తో కలిసి పనిచేశాను. కానీ ఇప్పుడు మన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. మరో ప్రయాణం ప్రారంభమైంది. సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ధన్యవాదాలు’ అని రానా ట్వీట్‌ చేశారు.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 2021 నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.